Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Mutton Biryani : ఈ ఆలయంలో స్వామివారికి మటన్ బిర్యానీనే నైవేద్యం… ఏ ఆలయంలో అంటే?

Mutton Biryani : సాధారణంగా మాంసాహారం తిని లేదా మాంసాహారం ముట్టుకొని ఆలయానికి వెళ్ళకూడదు అని చాలా మంది చెబుతుంటారు. అలా వెళ్లడం వల్ల అరిష్టం కలుగుతుందని భావిస్తారు. కానీ కొన్నిచోట్ల స్వామివారికి నైవేద్యంగా మాంసాహారం పెట్టడం గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం కానీ మటన్ బిర్యానీ నైవేద్యంగా పెట్టే ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా… వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకొందాం…

తమిళనాడులోని మదురైలో మునియంది ఆలయం ఉంది. అక్కడ  మునియంది అనే స్వామి కొలువై ఉన్నారు.ఈ ఆలయంలో స్వామివారికి నైవేద్యంగా తీపి పదార్థాలను కాకుండా నైవేద్యంగా మటన్ బిర్యానీనీ సమర్పిస్తారు. ఈవిధంగా స్వామి వారికి మటన్ బిర్యాని పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… మటన్ బిర్యానీ పెట్టడం వెనుక ఓ కథ ఉందని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

mutton-biryani-is-offered-to-the-lord-in-this-temple-do-you-know-which-temple

1973లో మదురై జిల్లాలోని వడకంపట్టి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బ్రతుకు జీవనం కోసం హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించాడు.తన హోటల్ వ్యాపారం అభివృద్ధి చెందడంతో ఆ వ్యక్తి చాలా సంతోషపడి స్వామి వారికి ఎంతో సంతోషంగా మటన్ బిర్యానీను నైవేద్యం సమర్పించారు. అప్పటినుంచి ఈ ఆలయంలో స్వామి వారికి నైవేద్యంగా మటన్ బిర్యానీ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికి భక్తులు స్వామి వారి ఆలయానికి వెళితే బిర్యాని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల వారు చేస్తున్న పనులలో విజయం సాధిస్తారని వారి నమ్మకం.

Advertisement

Read Also : Vastu Tips: ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే బీరువా తప్పనిసరిగా ఈ దిశలో ఉండాల్సిందే!

Exit mobile version