Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Vastu Tips : ఎంత సంపాదించినా ఆర్థిక ఇబ్బందులు తప్పటం లేదా? అయితే ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది?

Vastu Tips : సాధారణంగా పురాణాల ప్రకారం వాస్తు, జోతిష్యం పట్ల చాలా మందికి నమ్మకం ఉంటుంది. ఈ ఈ రోజుల్లో ఇలాంటి వాటి మీద చాలామందికి నమ్మకం ఉండదు. అయితే ఎంత సంపాదించినా కూడా ఇంట్లో మాత్రం ఆర్థిక సమస్యలు వేధిస్తుంటాయి. అయితే ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనలో ఉన్న కొన్ని చెడు అలవాట్లను మానుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి మనం మార్చుకోవాల్సిన చెడు అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

do-you-have-financial- problems-but-just-do-like-that-all-problems-will-slove

వాస్తు శాస్త్ర ప్రకారం పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మన శరీరం శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే మన ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటేనే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని వాస్తు శాస్త్రంలో తెలియజేశారు. ముఖ్యంగా మనం నివసించే ఇంట్లో ఈశాన్యం దిశ శుబ్రంగా ఉండాలి . ప్రతిరోజూ మనం నివసించే ఇంటిని శుభ్రపరుచుకోవటం వల్ల ధన లక్ష్మి మన ఇంట్లో కొలువుంటుంది.

ముఖ్యంగా ఇంట్లో ఆగ్నేయం దిశ వైపు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఉంచరాదు. అలా ఆగ్నేయం దిశలో డబ్బు ఉంచితే డబ్బు నీళ్ళలా కర్చవుతుందని వాస్తు శాస్త్రంలో తెలియజేశారు. అంతే కాకుండా డబ్బు, నగలు భద్రపరిచే ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురు ఉంచరాదు. ఒకవేళ అలా చీపురు ఉంచటం వల్ల ఇంట్లో లక్ష్మి దేవి నిలబడదు. అంతేకాకుండా సంధ్యా సమయంలో ఇంట్లో ఎవరూ పడుకోరాడు. ప్రతి రోజూ ఉదయం,సాయంత్రం సమయంలో ఇల్లు శుభ్రం చేసుకొని దీపారాధన చేయటం వల్ల ఇంట్లో ధన ధాన్యాలు మెండుగా ఉంటాయి. ఇంట్లో ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యే వారు ఈ పద్ధతులు పాటించటం వల్ల ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి.

Advertisement

Read Also : Vasthu tips: ఇల్లు అద్దెకు తీస్కునేటప్పుడు ఇవి కచ్చితంగా చూడాల్సిందే.. జాగ్రత్త సుమీ!

Exit mobile version