Nonveg On Sunday:ప్రస్తుతకాలంలో ఆదివారం వచ్చిందంటే చాలు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ రకాల మాంసాహారాలను తయారు చేసుకొని తినడం, మందు పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తూ ఆ రోజు మొత్తం ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఆదివారం అంటేనే మాంసాహారం రోజుగా భావిస్తారు. నిజానికి మన పురాణాల ప్రకారం ఆదివారం ఎంతో పరమ పవిత్రమైన రోజు అని చెప్పాలి.ఇలాంటి పవిత్రమైన రోజు ఎలాంటి మద్యం మాంసాహారాలను తాకకూడదని పురాణాలు చెబుతున్నాయి.
భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన కొనసాగాలంటే ముందుగా హిందువులు సాంప్రదాయాలను అణచివేయాలనే ఉద్దేశంతో ఎంతో పవిత్రమైన ఆదివారం సెలవు దినంగా ప్రకటించి ఆదివారం విచ్చలవిడిగా మద్యం మాంసాహారం తినడం అలవాటు చేశారు.ఇలా అప్పటినుంచి భారతీయులు కూడా ఆదివారం అంటే సెలవు దినంగా భావించి ప్రతి ఒక్కరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల మాంసాహారాలను తయారు చేసుకొని తింటుంటారు. పురాణాల ప్రకారం ఆదివారం పొరపాటున కూడా మద్యం మాంసం తీసుకోవడమే కాకుండా ఆడవారికి కూడా దూరంగా ఉండాలి అని పురాణాలు చెబుతున్నాయి.
