Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Vizag Sai Priyanka Case : భర్తకు మస్కాకొట్టి ప్రియుడితో పారిపోయిన సాయి ప్రియాంక కేసులో కొత్త ట్విస్ట్..!

Vizag Sai Priyanka Case : వైజాగ్‌లో సాయి ప్రియాంక కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఆర్కే బీచ్‌లో భర్తకు మస్కా కొట్టి ప్రియుడితో చెక్కేసిన కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. ప్రియుడితో అడ్డంగా దొరికిన తర్వాత ప్రియాంకపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియాంక సముద్రంలో గల్లంతైందని భర్త ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కోస్ట్ గార్డ్, నేవీ అధికారులు గాలించిన ఫలితం లేదు. హెలికాప్టర్లు, బోట్లతో తీవ్రంగా గాలించారు. ఇందుకోసం అధికారులకు భారీగా ఖర్చు అయింది. సముద్రంలో ప్రియాంక గల్లంతు కాలేదు.. ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందనే విషయం తెలియడంతో పోలీసులు షాకయ్యారు.

Vizag Sai Priyanka Case _ Another Twist on Vizag Sai Priyanka Case, Police filed for Misleading Navy Coast Guard Officials

పోలీసులను తప్పుదోవ పట్టించడమే కాకుండా విలువైన సమయంతో పాటు డబ్బు వృథా అయ్యేలా చేసినందుకు కోస్ట్ గార్డ్ పోలీసులు ప్రియాంకపై సీరియస్ అయ్యారు. వెంటనే ప్రియాంకపై చర్యలు తీసుకోవాలంటూ జీవీఎంసీ పోలీసులను కోరింది. కోర్టు అనుమతితో సాయి ప్రియాంక, ఆమె ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైజాగ్‌కు చెందిన శ్రీనివాస్‌కు సాయి ప్రియాంకతో పెళ్లి జరిగింది. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు.

PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

Vizag Sai Priyanka Case : సాయి ప్రియాంక, ప్రియుడిపై కేసు.. 

ప్రియాంక విశాఖలో చదువుకుంటోంది. కొన్ని రోజుల క్రితం పెళ్లి రోజున తన భార్యకు దగ్గరకు వచ్చి ఆమెకు బంగారు గాజులు గిఫ్టుగా ఇచ్చాడు. ఇద్దరూ కలిసి సింహాచలం గుడికి వెళ్లారు. రెస్టారెంట్‌కు వెళ్లి లంచ్ కూడా చేశారు. ఆ సాయంత్రం విశాఖ బీచ్‌కు వెళ్లారు. సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఇంటికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇంతలో శ్రీనివాస్ ఫోన్ మాట్లాడుతుండగా.. కాళ్లు కడుక్కుంటానని చెప్పి ప్రియాంక వెళ్లిపోయింది. బీచ్ దగ్గర ప్రియాంక కనిపించలేదు.

భార్య బీచ్‌లో గల్లంతయిందని భర్త శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బందితో గాలించారు. అయితే పోలీసులకు ప్రియాంక మిస్సింగ్ విషయంలో అనుమానం వచ్చింది. నిజంగానే బీచ్ లో గల్లంతయిందా? అనే లేదా కోణంలో ఆరా తీశారు. చివరికి అసలు విషయాన్ని పోలీసులు గుర్తించారు. బీచ్‌లో ప్రియాంక గల్లంతు కాలేదని, భర్తకు మస్కా కొట్టి ప్రియుడితో పారిపోయిందని నిర్ధారించారు. తండ్రికి తాను బెంగళూరులో ఉన్నానని, ప్రియుడిని పెళ్లి చేసుకున్నానంటూ ఫోన్ చేసి చెప్పింది. ఫొటోలు కూడా పంపింది. పోలీసులు చివరికి సాయి ప్రియాంకతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

Read Also : Anchor Anasuya: మీ చెల్లినో, భార్యనో ఇలాగే రేటు అడుగుతావా – యాంకర్ అనసూయ!

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Exit mobile version