Crime News: పోలీసులంటే ప్రజలను రక్షించే వారని అర్థం. కానీ ప్రస్తుత కాలంలో కొంతమంది పోలీసులు వారిని రక్షించడం సంగతి మరచిపోయి ప్రజలను రాక్షసుల పట్టి పీడిస్తున్నారు. పోలీసులంటే గతంలో ఎంతో అభిమానం ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో కొంతమంది పోలీసులు చేస్తున్న పనులకు పోలీసు వ్యవస్థ సిగ్గు పడే పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల చట్టానికి విరుద్ధంగా లంచం తీసుకుంటూ ఏసీబీ వల కు ఒక ఎస్సై అడ్డంగా దొరికిపోయాడు.
క్రమంలో హోటల్ కి సంబంధించి అన్ని అన్ని మాటలు సరిగ్గా ఉన్నా, అన్ని నిబంధనలు పాటిస్తున్నాకూడా ఎస్ఐ లంచం కోసం ఇబ్బంది పెడుతుండటంతో ఎలాగైనా బుద్ధి చెప్పాలని హోటల్ యాజమాన్యం నిర్ణయించుకునీ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
అయితే సదరు ఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పథకం వేశారు. శుక్రవారం ఎస్ ఐ లవ్ కుమార్ డ్యూటీ నుంచి రిలీవ్ అవుతూ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తున్న సమయంలో రూ 1.30 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
