Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Shilpa Shetty Shock : నా పరువు తీయొద్దంటూ వేడుకున్న శిల్పాశెట్టి..  

Shilpa Shetty Shock and strongly reacts to FIR against her in Cheating Case

Shilpa Shetty Shock and strongly reacts to FIR against her in Cheating Case

Shilpa Shetty Shock : సోషల్ మీడియాను ఊపేశాయి. తాజాగా ఈ ఉదంతంపై బ్యూటీ శిల్పా శెట్టి నోరు విప్పింది. అసలు పోలీస్ కేసులో పేర్కొన్న విషయాలు చూసి ఒక్క సారి షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది. 2014లో కషిఫ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి వ్యాపార లావాదేవీ నిమిత్తం కోటిన్నర తీసుకున్న శిల్పాశెట్టి దంపతులు డబ్బులు అడిగితే మొహం చాటేస్తున్నారని ఆయన బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శిల్పా శెట్టి కుంద్రా, ఆమె భర్త రాజ్ కుంద్రా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

దీనిపై స్పందించిన ఈ బ్యూటీ ఇలా తన పరువును బజారుకు ఈడ్చడం సబబు కాదంది. అసలు ఎస్ఎఫ్ఎల్ ఫిట్ నెస్ సెంటర్ ను కషిఫ్ ఖానే నిర్వహిస్తున్నాడని పేర్కొంది. అతడు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఎల్ ఫిట్ నెస్ సెంటర్ లు తెరవడానికి కావాల్సిన అన్ని హక్కులను తీసుకున్నాడు. అతడి లావాదేవీల గురించి మాకేం తెలియదని ఓపెన్ అయింది. అతడి వద్ద నుంచి మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపింది.

అన్ని ప్రాంచైజీలను కషిఫ్ పేరు మీదే నిర్వహిస్తున్నారని పేర్కొంది. ఏమైందో ఏమో కానీ 2014లో ఎస్ఎఫ్ఎల్ కంపెనీని మూసేశారు. దాని గురించి రాజ్ కు కానీ నాకు కానీ ఏం తెలియదని చెప్పింది. ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి నేను 28 ఏళ్ల నుంచి శ్రమిస్తూ వచ్చాను. ఇలా చేసి నాపేరును చెడగొట్టొద్దని ఈ భామ సూచించింది. తనకు దేశ చట్టాల మీద గౌరవం ఉందని పేర్కొంది.

Advertisement

Read Also : Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిరిపై సీరియల్ హీరో నందు షాకింగ్ కామెంట్స్..!

Exit mobile version