Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Crime News: పరీక్షలలో ఫెయిల్ అయ్యిందని ఆత్మహత్య చేసుకున్న నర్సింగ్ విద్యార్థి..!

Crime News: ఈ రోజుల్లో యువత ప్రతి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా కూడా దానికి పరిష్కరించకుండా క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుని తల్లి తండ్రులను బాధ పెడుతున్నారు. ముఖ్యంగా ప్రేమ పేరుతో మోసపోయి చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. మరి కొంతమంది చదువులో వెనకబడినందుకు మనస్తాపంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

పరీక్షలలో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో అఘాయిత్యానికి పాల్పడింది. వివరాలలోకి వెళితే..ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన దుబ్బాక శిరీష నిజామాబాద్ జిల్లా ధర్మారం లోని తిరుమల నర్సింగ్ హోమ్ కళాశాలలో జీఎన్ఎం కోర్సు చేస్తోంది. కోర్సుకి సంబంధించి చివరి పరీక్షలు కూడా రాసింది. పరీక్షలు అయిపోయాక మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఎన్నో కలలు కలిగింది. కానీ చివర రాసిన పరీక్షలలో కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయినందున తన ఆశలన్నీ అడియాసలయ్యాయి.

పరీక్షలలో ఫెయిల్ అయినందుకు శిరీష తీవ్ర మనస్తాపానికి గురైంది. పరీక్షలలో తప్పినందుకు బాధతో ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాసేపటి తర్వాత ఆమె సోదరుడు శిరీషాల దూలానికి వెళ్ళటం గమనించి వెంటనే ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే శిరీష ప్రాణాలు కోల్పోయింది. వెంటనే ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసే చెప్పగా కూతురు చేసిన పనికి తల్లితండ్రులు తల్లడిల్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Exit mobile version