Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Fire Accident : నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం… తెలంగాణకు చెందిన మతి స్థిమితం లేని మహిళ సజీవ దహనం !

mentally-disabled-women-dies-in-fire-accident-happened-in-nellore-district

mentally-disabled-women-dies-in-fire-accident-happened-in-nellore-district

Fire Accident in Nellore : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏఎస్‌ పేటలో షఫా బావి వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంటికి నిప్పంటుకుని హైదరాబాద్‌ కు చెందిన ఓ మహిళ సజీవ దహనం కాగా… మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షార్ట్‌ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు. దీంతో గుడిసెకు మంటలు అంటుకున్నాయని తెలిపారు.

కాగా బాధితులు హైదరాబాద్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. మృతురాలు ఫాతిమా ముష్రఫ్ గా గుర్తించారు. మతిస్థిమితం బాగాలేకపోవడంతో దర్గాకు వచ్చారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏఎస్ పేట లోని ఖాజా రహంతుల్లా దర్గాకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దర్గా గంధమహోత్సవం, ఉర్సు ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా మతి స్తితమితం లేనివారిని ఇక్కడకు తీసుకొస్తే నయమవుతుందని నమ్మకం. అందుకే ఎక్కువగా ఇక్కడికి మతి స్థిమితం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి దర్గాలో ప్రార్థనలు చేయిస్తుంటారు.

mentally-disabled-women-dies-in-fire-accident-happened-in-nellore-district

ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తాజాగా మంటల్లో కాలి బూడిదైన మహిళ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. దర్గాకు దగ్గరే అద్దెకు గదులు కూడా ఇస్తుంటారు. అక్కడే కొంతమందిని వదిలేసి నయం అయిపోయిన తర్వాత తీసుకెళ్తామని చెబుతుంటారు కుటుంబ సభ్యులు. అయితే… వారి బాగోగులు చూసుకునేందుకు అనధికారికంగా విచ్చలవిడిగా గ్రామంలో సంరక్షణ కేంద్రాలు వెలిసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Read Also : Chandrababu Naidu : కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించిన చంద్రబాబు… ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టడంపై హర్షం !

Exit mobile version