Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral Video : ప్రేయసిని రిసార్ట్‌కి తీసుకెళ్లిన ప్రియుడు.. ఆ ప్రేమోన్మాది ఏం చేశాడో వీడియో చూడండి!

Viral Video : మధ్యప్రదేశ్‌‌లో దారుణం జరిగింది. ప్రియురాలిని రిసార్ట్‌కు తీసుకెళ్లిన ఓ ప్రేమోన్మాదిని దారుణానికి పాల్పడ్డాడు. రిసార్ట్‌లో జరిగిన యువతి హత్య కేసులో ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆ నిందితుడు తన ప్రియురాలిని ఎందుకు చంపాల్సి వచ్చిందో వీడియో కూడా రిలీజ్ చేశాడు.

Madhya Pradesh police arrested the boyfriend after killed his girlfriend at the resort

ప్రియురాలిని తానే చంపిన విషయాన్ని వీడియోలో చెప్పాడు. ఆ వీడియోను సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. జబల్పూర్‌‌లోని రిసార్ట్‌లో అభిజిత్‌ పాటిదార్ అనే వ్యక్తి తాను ప్రేమించిన యువతితో రిసార్ట్‌కు వెళ్లాడు. మరుసటిరోజు ఆ యువతి రక్తపు మడుగులో పడి ఉంది.

Viral Video : రిసార్ట్‌లో హత్య.. ప్రేమోన్మాది వీడియో వైరల్..

అనంతరం ప్రియుడు కనిపించకుండా పోయాడు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మర్డర్ మిస్టరీని చేధించారు. తనను బ్లాక్‌మెయిల్‌ చేసిందనే కోపంతోనే ఆమెను హత్య చేసినట్టు ప్రియుడు పోలీసులకు వెల్లడించాడు. ఫోన్‌ సిగ్నల్, కాల్‌డేటా ఆధారంగా యువతి హత్య జరిగిన రిసార్ట్‌కి పోలీసులు చేరుకున్నారు.

Advertisement

నిందితుల వీడియోల ఆధారంగా హత్య చేసింది ఎవరో గుర్తించారు. తాను ప్రేమిస్తే నమ్మకద్రోహం చేయడమే కాకుండా బ్లాక్‌మెయిల్ చేసిందంటూ అందుకే ఆమెను హత్య చేసినట్టు వీడియోలో అభిజిత్‌ పాటిదార్ వెల్లడించాడు. ఆ తర్వాత ఆ వీడియోను డిలీట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Read Also :  Geethu Royal : నాగార్జునపై గీతూ రాయల్ షాకింగ్ కామెంట్స్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి అందుకే ఎలిమినేట్ అయ్యాను..!

Advertisement
Exit mobile version