Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

kanpur boy suicide : ప్రియురాలు మోసం చేసిందని యువకుడు బాత్ రూమ్ లో ఏం చేశాడో తెలిస్తే షాకే..

kanpur boy suicide : ఆ కుర్రాడి పేరు శివం. జలౌన్‌లోని దహెఖండ్ దివారాలో తల్లిదండ్రులతో ఉంటూ డిగ్రీవరకూ చదువుకున్నాడు. ఆ తర్వాత సిటీకి వెళ్ళాడు. అక్కడ హాస్టల్ లో ఉంటూ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఒకరోజు ఆ కుర్రోడి హాస్టల్ లోని బాత్ రూమ్ లో దారుణం జరిగిపోయింది. అద్దం వెనుక తన ప్రేయసి ఫోటోను అతికించి మరీ శివం శవంగా మారాడు.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం కుటుంబ సభ్యులు శివానికి ఎంత సేపటి నుంచి ఫోన్ చేస్తున్నా స్పందించలేదు. దాంతో కంగారు పడిన తల్లిదండ్రులు హాస్టల్ ఓనర్ లాల్జీ బాయ్‌పే కు సమాచారం అందించారు. దాంతో అతడు శివం గదికి వెళ్ళి ఎంతసేపు తలుపు తట్టినా తెరవలేదు. దీంతో వెంటనే లాల్జీ కళ్యాణ్ పూర్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి హాస్టల్ గది తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్ళగా అక్కడ ఫ్యాన్ కు వేళాడుతూ శివం మృతదేహం కంటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కు తరలించారు.

శివం గదిని చెక్ చేసిన పోలీసులకు బాత్ రూమ్ అద్దం వెనుక ఒక అమ్మాయి ఫోటో కంటపడింది. ఆ ఫోటో వెనుక సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివం ఎప్పుడూ తన ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడే వాడని, కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, దాంతో శివం ఫోన్ మాట్లాడడం మానేశాడని నిరాశతో కుంగిపోయిన శివం ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే సూసైడ్ నోట్ లో ‘రేణు నువ్వు చేస్తున్న పని సరైనది కాదు, నువ్వు నన్ను మోసం చేశావ్ . అసలు నువ్వు నన్నెందుకు ప్రేమించావ్?’ అని రాసుంది. అయితే మరణానంతరం రేణును ఎవరూ వేధించకూడదని శివం నోట్ లో పోలీసులకు తెలిపాడు. కళ్యాణ్ నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు తరలించారు.

Advertisement
Exit mobile version