Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Hyderabad Crime : హైదరాబాద్ నడిబొడ్డున మరో పరువు హత్య.. కూతురు ముందే భర్తను దారుణంగా చంపిన వైనం!

Hyderabad Crime : హైదరాబాద్ నడిబొడ్డున పరువు హత్య జరిగింది. కూతురు చూస్తుండగానే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని అతి దారుణంగా చంపిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అలియాస్ పల్లవి (23) ప్రేమించుకుంటున్నారు. వీరి మతాలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటయ్యాయి. ఇద్దరు ఒకరి పై ఒకరు అమితమైన ప్రేమను పెంచుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

Hyderabad Crime

అయితే ఈ విషయం ఆశ్రిన్ ఇంటిలో తెలియడంతో నాగరాజుకు ఆమె కుటుంబసభ్యులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇద్దరూ కలిసి ఇల్లు వదిలి పోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బ్రతుకుతెరువు కోసం ముందుగా ఉద్యోగం చేయాలనుకున్నా నాగరాజు హైదరాబాద్లో ఓ కార్ల షోరూం సేల్స్ మెన్ గా పనిచేశారు. ఇక తనకు ఉద్యోగం వచ్చిందనే విషయాన్ని ఆశ్రిన్ కి చెప్పగా వీరిద్దరూ ఇల్లు వదిలి పారిపోయి హైదరాబాదులో ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.

ఆశ్రిన్ ఇంటి నుంచి తమకు సమస్య ఎదురవుతుందని గ్రహించిన వీరిద్దరూ హైదరాబాద్ వదిలి విశాఖపట్నం చేరుకున్నారు. అయితే వధువు కుటుంబ సభ్యులు హైదరాబాద్లో వీరి కోసం ఎన్నో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆశ్రిన్ కుటుంబ సభ్యులు తమ కోసం వెతకడం లేదని తెలుసుకున్న ఈ జంట తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్న వీరు సరూర్ నగర్‌లోని పంజా అనిల్ కుమార్ కాలనీలోని ఓ అద్దెకి ఇంటిని తీసుకుని అక్కడ నివసిస్తున్నారు.

Advertisement

ఈ జంట హైదరాబాద్ వచ్చారని తెలుసుకున్న ఆశ్రిన్ కుటుంబ సభ్యులు వీరి కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి వీరిద్దరూ కలిసి బైక్‌పై వెళ్తుండగా జీహెచ్ఎంసీ రోడ్డు ప్రాంతంలో ఓ వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. బండి ఆపిన వెంటనే ఓ వ్యక్తి గడ్డ పార తీసుకొని నాగరాజును అతి దారుణంగా పొడిచి చంపిన ఘటన చోటు చేసుకుంది.అయితే తన భర్తని చంపింది తన సోదరుడు అని పోలీసులకు ఆశ్రిన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు.

Read Also : Babu Gogineni: దేవి నాగవల్లి, విశ్వక్ సేన్ మేటర్ లోకి ఎంటరైన బాబు గోగినేని.. తప్పెవరిది?

Advertisement
Exit mobile version