Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Wanaparthy: కోడలిపై కన్నేసిన మామ… వేధింపులు భరించలేక చావగొట్టిన కోడలు?

Wanaparthy:ప్రస్తుత కాలంలో వావివరుసలు మరచి పోయి తండ్రి కూతురు అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని కూడా పక్కనపెట్టి ఆడవారిపై లైంగిక వేధింపులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా నిత్యం ఎన్నో సంఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వనపర్తిలో చోటు చేసుకుంది. కొడుకు మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఏకంగా మామ కోడలిపై లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

daughter-in-law-beats-father-in-law-in-wanaparthi

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మంలం చెన్నూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి కొడుకు అదే గ్రామానికి చెందిన చంద్రకళ అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే తన కొడుకు మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ మామ ఇదే అదునుగా భావించి తన కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.అయితే తన మామ లైంగిక వేధింపులను భరించలేక చంద్రకళ తన తమ్ముడు సహాయంతో తన మామ పై దాడి చేసింది.

ఈ దాడిలో భాగంగా తీవ్ర గాయాలపాలైన రాములను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయారు.అయితే రాములు బంధువులు తెలిపిన వివరాల మేరకు చంద్రకళ తన భర్త మానసిక ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఈ ఆస్తిపై ఉద్దేశపూర్వకంగానే తన తమ్ముడి సహాయంతో రాములను కొట్టి చంపిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చంద్రకళ, తన సోదరుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement
Exit mobile version