AP Crime: ఈ రోజుల్లో యువతకు ఎన్నో తెలివితేటలు ఉన్నప్పటికీ కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించడం కన్నా అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకుని అడ్డు దారులలో డబ్బులు సంపాదించడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున భారీ మోసాలకు తెర లేపుతూ ఎంతో మందిని మోసం చేస్తూ లక్షల్లో డబ్బులు పోగు చేసుకున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి విశాఖపట్నం గాజువాక వీధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తాజాగా విష్ణుమూర్తి ఏప్రిల్ 24న తిజార నియోజకవర్గం ఎమ్మెల్యే సందీప్ యాదవ్ కి ఫోన్ చేసి ఎప్పటిలాగే తన రాజస్థాన్ ముఖ్యమంత్రి అంటూ ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగారు.దీంతో అనుమానం వచ్చిన సందీప్ యాదవ్ రాజస్థాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇతని ఆచూకీ కనుక్కొని అసలు విషయం బయట పెట్టారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ పోలీసులు అతనిని ట్రాన్సిట్ వారెంట్ పై రాజస్తాన్ తీసుకెళ్లారు. పోలీసుల విచారణలో విష్ణు లీలలు బయటపడ్డాయి.విష్ణుమూర్తి ఇప్పటివరకు ఎంత మంది ఎమ్మెల్యేలు ఎంపీలకు ఫోన్లు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లగొట్టాడు అయితే ఇలాంటి పని చేయడానికి గల కారణం తన ప్రియురాలు అని తన కోరికలు తీర్చడం కోసమే తాను ఇలాంటి పనులు చేస్తున్నానని తెలిపారు.ఈ క్రమంలోనే తన ప్రియురాలు కోరిక మేరకు తనకు ఏకంగా 80 లక్షల విలువచేసే ఇంటిని విష్ణుమూర్తి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.