MG Windsor EV : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే. ఎలక్ట్రిక్ కారు JSW MG కొత్త విండ్సర్ EV కారు (MG Windsor EV) ఇప్పుడే కొనేసుకోండి. మీరు ఈ కారును కొనుగోలు చేస్తే.. డౌన్ పేమెంట్ తర్వాత మీరు ఎంత EMI చెల్లించాలి? కారు కొనేందుకు మీకు ఎంత మొత్తంలో ఖర్చవుతుంది అనే వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
MG విండ్సర్ EV ధర ఎంతంటే? :
ఎంజీ మోటార్స్ ప్రవేశపెట్టిన కొత్త ఎలక్ట్రిక్ SUV విండ్సర్ EV బేస్ వేరియంట్ రూ. 13.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. మీరు ఢిల్లీలో కొనుగోలు చేస్తే.. ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 14.94 లక్షలు.
ఈ మొత్తం ధరలో రూ. 13.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర, దాదాపు రూ. 6,300 ఆర్టీఓ రుసుము, దాదాపు రూ. 73వేలు ఇన్సూరెన్స్ ఉన్నాయి. అంతేకాదు.. రూ. 14,700 TCS ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపితే కారు మొత్తం ఆన్-రోడ్ ధర రూ. 14.94 లక్షలు అవుతుంది.
MG Windsor EV : 2 లక్షల డౌన్ పేమెంట్, ఈఎంఐ ఎంతంటే? :
మీరు ఈ కారు బేస్ వేరియంట్ కొనుగోలు చేస్తే.. బ్యాంక్ ఎక్స్-షోరూమ్ ధరకు ఫైనాన్స్ చేస్తుంది. అలాంటప్పుడు, మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు నుంచి దాదాపు రూ. 12.94 లక్షల ఫైనాన్స్ పొందాలి. బ్యాంక్ మీకు 7 ఏళ్లకు 9శాతం వడ్డీతో రూ. 12.94 లక్షలు ఇస్తే.. రాబోయే 7 ఏళ్లకు ప్రతి నెలా కేవలం రూ. 20,820 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
Read Also : POCO M7 Plus : పోకో కొత్త బడ్జెట్ ఫోన్ చూశారా? 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర కూడా చాలా తక్కువే
MG Windsor EV : కారు ఖరీదు ఎంతంటే? :
7 ఏళ్ల పాటు 9శాతం వడ్డీ రేటుతో రూ.12.94 లక్షల కారు రుణం తీసుకుంటే.. ప్రతి నెలా దాదాపు రూ.20,820 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలంలో, మొత్తం 7 ఏళ్లలో దాదాపు రూ.4.55 లక్షల వడ్డీని మాత్రమే చెల్లిస్తారు. ఎక్స్-షోరూమ్ ధర, ఆన్-రోడ్ ఛార్జీలు, వడ్డీతో సహా, ఎంజీ విండ్సర్ ఈవీ దాదాపు రూ.19.49 లక్షలు ఖర్చవుతుంది.
ఏయే కార్లతో పోటీ అంటే? :
విండ్సర్ EV కారు JSW MG ఎలక్ట్రిక్ కారుగా వచ్చింది. టాటా కర్వ్ EV, మహీంద్రా BE6 వంటి ఎలక్ట్రిక్ SUV కార్లతోతో నేరుగా పోటీపడుతుంది.