Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold Rate Today : బంగారం కొనేవారికి పండగే.. భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం ఎంతంటే?

Gold Rate Today Feb 23 2026

Gold Rate Today Feb 23 2026

Gold Rate Today Feb 23,2026 : బంగారం ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. కొత్త వారం మొదటి రోజున బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఫిబ్రవరి 23, 2026న ఉదయం దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 159,420గా ఉంది. ముంబైలో 10 గ్రాములకు రూ. 159,270గా ఉంది. ఒక వారంలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,530, 22 క్యారెట్ల బంగారం రూ. 1,400 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం స్పాట్ ధర ఔన్సుకు 5,027.13 డాలర్లుగా ఉంది.

Gold Rate Today :  తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలివే :

హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 15,927, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 14,599, 18 క్యారెట్ల బంగారం (999 బంగారం) గ్రాముకు రూ. 11,945 ధర పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల (Gold Prices Today) బంగారం 10 గ్రాములకు రూ.1,59,270 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,45,990 ధర పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు హైదరాబాద్ మాదిరిగానే ట్రేడ్ అవుతున్నాయి.

వెండి ధరల విషయానికి వస్తే..
హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 2,89,900 ధర పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా వెండి ధరలు ఇదే విధంగా ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి వెండ ధరలు రూ. రూ. 2,90,000 నుంచి రూ. 100 తగ్గాయి.

Advertisement

Gold Rate Today : దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే :

ఢిల్లీలో బంగారం ధర :
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 159,420 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.146,140కు ట్రేడ్ అవుతోంది.

ముంబై, చెన్నై, కోల్‌కతా :
ప్రస్తుతం, ముంబై, చెన్నై, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,46,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,59,280గా ఉంది.

పూణే, బెంగళూరులో ధర :
ఈ రెండు నగరాల్లోనూ, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 159280, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 146000గా ట్రేడ్ అవుతోంది.

Advertisement

Read Also : Gold and Silver Outlook : వచ్చే వారం భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు.. నిపుణుల హెచ్చరిక

అమెరికాలో సుంకాలపై కొత్త పరిణామాలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి ఎంపికల వైపు మొగ్గు చూపుతారని నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో బులియన్‌కు డిమాండ్ బలంగా పెరగొచ్చు. వారంలో బంగారం, వెండి ధరలు అమాంతం పెరగవచ్చు.

గత శుక్రవారం, భారత్ సహా దాదాపు 60 దేశాలపై ట్రంప్ గత ఏడాది జారీ చేసిన సుంకాల ఉత్తర్వులు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆ తర్వాత, అమెరికాలోకి వచ్చే దిగుమతులపై సుంకాన్ని ప్రస్తుత వర్తించే రేటుకు అదనంగా 10శాతం పెంచాలని ట్రంప్ నిర్ణయించారు. ఆ తర్వాత శనివారం ఈ రేటును 15శాతానికి పెంచారు.

Advertisement

ఫిబ్రవరి 23న ఉదయం వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఈ ధర కిలోగ్రాముకు రూ. 2,74,900కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి స్పాట్ ధర ఔన్సుకు 80.5 డాలర్లు పలుకుతుండగా గత జనవరిలో వెండి ధర రూ. 4 లక్షల మార్కును దాటింది.

Exit mobile version