Trump Meme Coin : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ట్రంప్ తన ($TRUMP) మీమ్ కాయిన్‌ను మార్కెట్‌లో విడుదల చేశారు. ఈ ట్రంప్ మీమ్ కాయిన్ ($TRUMP Meme Coin) నాణెం ప్రారంభించిన వెంటనే వేగంగా మార్కెట్లో దూసుకెళ్లింది. డిజిటల్ నాణెం మార్కెట్ విలువ ప్రారంభించిన కొద్ది గంటలకే 5.5 బిలియన్ డాలర్లు (£4.5 బిలియన్) వరకు పెరిగింది.
ఒక్కసారిగా 300శాతం పెరిగింది. నాణెం మార్కెట్ మూలధనం కొద్దికాలంలోనే 8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో, కాయిన్ వాణిజ్య పరిమాణం ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్ (TRUMP Coin Price) మెమె కాయిన్‌ని తన రెండోసారి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టడానికి ఒక రోజు ముందు ప్రారంభించారు.
జనవరి 20 నుంచి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ట్రంప్ మీమ్ కాయిన్ ($TRUMP) క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ను ప్రారంభించిన వెంటనే తుఫానుగా మార్చేసింది. ఈ ట్రంప్ కాయిన్ ప్రారంభ విలువ 0.18 డాలర్లు. కాయిన్ మార్కెట్ (CoinMarketCap)ప్రకారం.. ప్రారంభించిన కొద్ది గంటల్లోనే అది 7.1 డాలర్లకి చేరుకుంది. ఈ కాయిన్ ధర 21.51 డాలర్లకి పెరిగింది. మీమ్ కాయిన్‌లో 231.61 శాతంతో ముందుకు దూసుకెళ్లింది. ట్రంప్ మీమ్ కాయిన్ ($TRUMP) సోలానా బ్లాక్‌చెయిన్‌పై రూపొందించారు.
ఈ కాయిన్ పరిమిత సరఫరా 1 బిలియన్ టోకెన్లు. ప్రస్తుతం 20 కోట్ల నాణేలు విడుదలయ్యాయి. మిగిలిన కాయిన్స్ సరఫరాను మూడేళ్లలో దశలవారీగా విడుదల చేస్తారు. ఈ కాయిన్ (trump meme token) టోకెన్లలో 80శాతం ట్రంప్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ (CIC) డిజిటల్ (LLC) యాజమాన్యంలో ఉన్నాయి. దాంతో పాటు, ఫైట్ ఫైట్ (LLC) కూడా ఇందులో చేర్చారు. ఇది డెలావేర్ ఆధారిత కొత్త ఎంట్రీగా చెప్పవచ్చు. ఈ కాయిన్ రిజిస్ట్రేషన్ రెండు రోజుల క్రితమే జరిగిందన్నారు.
ట్రంప్ తన మెమె కాయిన్ గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా పోస్ట్ చేశాడు. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. తన ఎక్స్ అకౌంటులో కూడా పోస్ట్ చేసారు. 48 గంటల విండోలోపు (gettrumpmemes.com) వెబ్‌సైట్ ద్వారా టోకెన్‌లను కొనుగోలు చేయాలని ఫాలోవర్లను కూడా కోరారు. ($TRUMP) కాయిన్ ప్రారంభించిన వెంటనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
Read Also : TikTok Ban : అమెరికాలో టిక్‌టాక్ బంద్.. నేటి నుంచే అమల్లోకి..!
Natu Kodi Pulusu : నాటుకోడి పులుసు రుచిగా రావాలంటే ఈ మసాలా పొడిని వేసి చూడండి.. టేస్ట్ మాత్రం…
Minapappu Pachadi : ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యితో తింటే అదిరిపోద్ది. మినప్పప్పుతో రోటి పచ్చడి…
Kiran Abbavaram : యువ నటులు రహస్య, కిరణ్ అబ్బవరం తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.
Thotakura Pesarapappu : తోటకూర పెసరపప్పు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ ఈ రెసిపీ…
Tiktok ban in us : అమెరికాలో టిక్‌టాక్ ముగబోయింది. ఆదివారం (జనవరి 19) నుంచి అమెరికాలో కొత్త చట్టం…
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
This website uses cookies.