Strong Password:ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఎంతోమంది సైబర్ నేరగాళ్లు చాలా ఈజీగా మన అకౌంట్ హ్యాక్ చేస్తూ మన అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తూ ఉంటారు. అయితే మనం మన అకౌంట్ కు సాధారణమైనటువంటి పాస్ వర్డ్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి హ్యాక్ జరుగుతూ ఉంటుంది. అందుకే స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టుకోవడం వల్ల మన అకౌంట్ హ్యాక్ అవుతూ ఉంటుంది. మరి స్ట్రాంగ్ పాస్ వర్డ్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే…
చాలామంది వారి అకౌంట్ కి వరుసగా నంబర్లు లేదా సున్నా నుంచి పైకి నెంబర్లు పెట్టుకోవడం. వారి ఇంటి పేరు పాస్ వర్డ్ గా పెట్టుకోవడం చేస్తుంటారు. మరికొందరు మర్చిపోకుండా సులభంగా గుర్తు పెట్టుకోవడం కోసం కీబోర్డులో asdfg లేదా qwer ఇలా వరుసగా పాస్వర్డ్ పెట్టుకుని ఉంటారు. ఇలాంటి పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు తొందరగా మన అకౌంట్ హ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి. మరి ఎలాంటి పాస్ వర్డ్ పెట్టుకోవాలి అనే విషయానికి వస్తే..
* పాస్ వర్డ్ లో కనీసం 8 క్యారెక్టర్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే పాస్ వర్డ్ లో అప్పర్ కేస్, లోయర్ కేస్ అక్షరాలతో పాటు గుర్తులను కూడా ఉపయోగించాలి. ఉదాహరణకు ghK@6fA వంటి పాస్ వర్డ్ లను పెట్టుకోవాలి.
*పాస్ వర్డ్ ఎప్పుడూ కూడా సాధారణ డిక్షనరీ పదాలను ఉపయోగించకూడదు. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించడం ఎంతో మంచిది.
*ఈ విధమైనటువంటి పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల హ్యాకర్స్ తొందరగా మీ పాస్వర్డ్లను హ్యాక్ చేయలేరు కనుక ఎప్పుడూ కూడా సాధారణ పాస్వర్డ్ కన్నా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవడం ఎంతో మంచిది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World