Vishwa Deendayalan Died : తమిళనాడుకు చెందిన ఓ యువ క్రీడాకారుడు దీనదయాలన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతడు ఛాంపియన్షిప్స్ పోటీల్లో పాల్గొని విజేతగా తిరిగి రావాలని వెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని టెబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈరోజు అంటే ఏప్రిల్ 18 సోమవారం 83వ సీనియర్ నేషనల్ అండ్ ఇంటర్ స్టేట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఏప్రిల్ 17న విశ్వ సహా మరో ముగ్గురు ఆటగాళ్లు ట్యాక్సీలో గువాహటి నుంచి షిల్లాంగ్‌కు బయలుదేరారు.
ఈ క్రమంలోనే ఎన్‌హెచ్ 6పై ప్రయాణిస్తుండగా షాంగ్బంగ్లా వద్ద ఎదురుగా వచ్చిన ఓ ట్రక్ అదుపుతప్పి.. ఈ ప్లేయర్స్ ప్రయాణిస్తున్న ట్యాక్సీపైకి దూసుకొచ్చి బలంగా ఢీ కొట్టింది. దీంతో ట్యాక్సీ డ్రైవర్, విశ్వ అక్కడికక్కడే కన్నుమూయగా.. రమేశ్ సంతోశ్ కుమార్, అభినాష్ ప్రసన్నాజీ, కిషోర్ కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పలువురు క్రీడా ప్రముఖులు సహా మేఘాలయ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. విశ్వ మరణం తనను తీవ్ర బాధకు గురి చేసిందని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మ ట్వీట్ చేశారు.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.