Singer Chinmayi : తెలుగు చిత్రపరిశమ్రలో సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తన మధురగాత్రంతో శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకుంది. సింగర్ చిన్మయిని కొందరు సీనియర్ గాయని ‘చిత్ర’తో పోలుస్తుంటారు. ఆమె గాత్రం అంత మధురంగా ఉంటుందని ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది.
అయితే, చిన్మయిని గాయనిగా కాకుండా చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గుర్తుపడుతారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ ‘సమంత’ అడుగుపెట్టిన నాటి నుంచి ఆమెకు డబ్బింగ్ చెప్పింది చిన్మయినే. ఈమె వాయిస్ లేకుండా సామ్‌ను స్క్రీన్‌పై చూడలేమంటే అతిశయోక్తి కాదు. అంతలా సామ్ పర్సనాలిటీకి చిన్మయి వాయిస్‌ను ఫిక్స్ అయిపోయారు ఆడియెన్స్.
అయితే, పలు సామాజిక అంశాలపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా వేగంగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా విడుదలైన ఓ సర్వే ప్రకారం తెలంగాణలో భర్తలు ఎంత వేధించిన భార్యలు తమ మగవాళ్లకే సపోర్టు చేస్తున్నారంట.. ఈ విషయంపై స్పందించిన చిన్మయి సంచలన కామెంట్స్ చేసింది. భార్యను భర్త కొడితే అది తప్పకుండా గృహహింస కిందకే వస్తుందని పేర్కొంది. అయితే, కొందరు ఆడవాళ్లు మాత్రం మా భర్తలు తమపై ప్రేమతోనే కొడుతున్నారని చెప్పుకొచ్చారట.. దీనిపై ఆమె మండిపడింది.
ఈ సర్వే రిపోర్టును షేర్ చేసిన ఆమె.. భార్యలను కొట్టడం కరెక్టే అని కర్ణాటకలో 81శాతం మంది మగవాళ్లు చెబుతుంటే.. మన రాష్ట్రంలోని 83 శాతం మంది ఆడవాళ్లు కూడా భర్తలే కరెక్ట్ అన్న విధంగా మాట్లాడారట.. అయితే, భర్తలు భార్యలను ఎందుకు కొడుతున్నారో కూడా చెప్పుకొచ్చింది చిన్మయి.
భర్తతో వాదించడం, సెక్స్‌కు నో చెప్పడం, వంట సరిగా చేయకపోవడం, అబద్దాలు, నమ్మకం లేకపోవడం, అత్తమామలకు గౌరవం ఇవ్వకపోతే, చెప్పకుండా బయటకు పోవడం ఇటువంటి సందర్భాల్లో భర్తలు తన పెళ్లాలను కొడుతున్నట్టు వెల్లడించింది. తెలంగాణ ఆడవాళ్లు భర్తలను ఎందుకు భరిస్తున్నారంటే వారికి ఆర్థిక స్వతంత్రం లేకపోవడం, చిన్నతనంలో పెళ్లిళ్లు చేయడం, చదువు లేకపోవడం వంటి కారణాల వల్లే భరిస్తూ వస్తున్నారని పేర్కొంది చిన్మయి.
Read Also : Bigg Boss 5 Telugu : దీప్తి.. దీప్తి అని ‘షణ్ముక్’ అంతలా కలవరించింది ఇందుకా..? ఆ సైగలతో హింట్ ఇచ్చిందా?
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.