Samantha Shakuntalam : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన దృశ్యకావ్యం మూవీ (Shakuntalam)లో విలన్ ఎవరో రివీల్ అయిపోయింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీలో శకుంతల పాత్రలో సమంత నటించగా.. ఆమెకు జోడీగా దుశ్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించాడు. అయితే ఇప్పటివరకూ విలన్ రోల్ ఎవరు చేశారనేది సస్పెన్స్ గా ఉంది. ఇంతకీ మూవీలో కింగ్ అసుర రోల్ ఎవరూ చేశారనేది రివీల్ చేయలేదు.
ఇప్పుడా ఆ విలన్ రోల్ చేసిందో ఎవరో తెలిసింది.. అతడు ఎవరో కాదు.. బాలీవుడ్ నటుడు కబీర్ దుహాన్ సింగ్ (Kabir Duhan Singh).. అంట.. ఇదివరకే కబీర్ సింగ్ తెలుగు సినిమాల్లో నటించాడు. గోపిచంద్ నటించిన జిల్ మూవీలో కబీర్ సింగ్ విలన్ రోల్ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇప్పటికే చాలా సినిమాలు చేసేశాడు.
సమంత శాకుంతల మూవీలో కింగ్ అసుర రోల్… తన కెరీర్ లోనే గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని కబీర్ సింగ్ అంటున్నాడు. కబీర్ సింగ్ మార్షల్ ఆర్ట్స్ పెర్ఫార్మన్స్ అద్భుతంగా చేస్తాడని తెలిసి దర్శకుడు గుణశేఖర్ కబీర్‌తో లుక్ టెస్ట్ చేయించరాట.. అతడి లుక్ పర్ ఫెక్ట్ గా సరిపోవడంతో కింగ్ అసుర రోల్‌కు కబీర్ సింగ్‌నే ఫైనలైజ్ చేశారు. ‘శాకుంతలం’ మూవీలో దుశ్యంతుడి(దేవ్ మోహన్)తో తనకు మధ్య భారీ యుద్ధ సన్నివేశం ఉందని కబీర్ సింగ్ రివీల్ చేశాడు.
దాదాపు 10 రోజుల పాటు వార్ సీక్వెన్స్ తీశారని కబీర్ సింగ్ చెప్పుకొచ్చాడు. అన్ని యుద్ధ సన్నివేశాల్లో 18 కిలోల కిరీటం ధరించినట్టు చెప్పుకొచ్చాడు. ఇంకా ఛాతిపై ధరించిన రక్షణ కవచం ఒరిజినల్ అని తెలిపాడు. కానీ, అది చాలా బరువుగా ఉందని మోయడమే కష్టంగా ఉండేదని తెలిపాడు. తెలుగులో తాను నటించిన సినిమాలతో పోలిస్తే… ‘శాకుంతలం’లో తన నటన, డైలాగ్ డెలివరీ అందరిని ఆకట్టుకుంటుందని కబీర్ సింగ్ తెలిపాడు.
నిర్మాత ‘దిల్’ రాజు సమర్పణలో DRP (దిల్ రాజు ప్రొడక్షన్స్), గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ‘శాకుంతలం’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ (Allu Arha) కూడా నటించింది. ఇప్పటికే శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతోంది. 2022 ఏడాదిలోనే శాకుంతలం మూవీని రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.
Read Also : Kid Play Snake Video : వామ్మో.. ఈ బుడ్డోడు మాములోడు కాదుగా.. పాముకే చుక్కలు చూపించాడు చూడండి..!
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.