Samantha Career Jet Speed after Divorce with Naga Chaitanya
Samantha : నాగచైతన్యతో విడాకుల అనంతరం అందాల భామ సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఎప్పుడులేనంతగా తన విశ్వరూపం చూపిస్తోంది. విడాకుల తర్వాత కొత్త లైఫ్ మొదలుపెట్టిన సమంత తన కెరీర్ గ్రాఫ్ ను పెంచుకుంటోంది. చేదు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలోనే సౌత్ ఇండియాలోనే నెం.1 వన్ పాపులర్ హీరోయిన్ గా అవతరించింది. ఇన్ స్టాలో తెగ రచ్చ చేసేస్తోంది సామ్.. సౌత్ ఇండియా హీరోయిన్లలో ఎవరికిలేని క్రేజ్ సంపాదించుకుంది. సినిమాల విషయంలోనూ అదే స్పీడ్ కనిపిస్తోంది. అరుదైన గౌరవాలను అందుకుంటూనే అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.
విడాకుల తర్వాత నాగ చైతన్య, సమంత వార్తల్లోనే నిలుస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌లోనే వీరద్దరే నిలుస్తున్నారు. చైతూ, సామ్ ఏ పనిచేసినా నెటిజన్లు ఆసక్తిగా వాచ్ చేస్తున్నారు. ఫ్యామిలీ పార్టీలతో సినిమాలతో బిజీగా చైతూ గడిపిస్తుంటే.. సమంత కూడా యాత్రల్లో పర్యటిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. సామ్.. తన బాధను సన్నిహితులతో కూడా షేర్ చేసుకోలేదంట.. షూటింగ్స్‌కు వెళ్లినా బాధగా కూర్చుని ఒంటరిగానే బాధ పడుతుందట.. లొకేషన్‌లో ఉన్నవాళ్లే ఈ మాట అంటున్నారు.
అందుకే మనసు బాగోలేక ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లినట్టుంది సమంత. భారత్‌లో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంది. చార్ ధామ్ యాత్రలో యమునోత్రి, బద్రీనాథ్ లోనూ హెలికాప్టర్‌లో ట్రిప్ వేసింది. విడాకుల కంటే ముందే సంచలన పోస్టులు పెడుతోంది సమంత. సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి నాగ చైతన్యతో దిగిన ఫొటోలను డిలీట్ చేసేసింది సమంత. చైతూతో కలిసి ఉన్న 85 ఫోటోలను డిలీట్ చేసింది.
పాత జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు సామ్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. చైతో జ్ఞాపకాలన్నింటినీ చెరిపివేసుకోవడమే మంచిదనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 2వ తేదీన సమంత, నాగ చైతన్య విడాకులపై అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి విడాకుల విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. సమంతపై కొందరు తప్పుడు ప్రచారం కూడా జరిగింది.
ఈ క్రమంలో సామ్ కోర్టును కూడా ఆశ్రయించి విజయం సాధించింది.. విడాకుల అనంతరం సినిమాలు బాగానే సైన్ చేసేస్తోంది. ప్రస్తుతం గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తి అయింది. విడాకుల తర్వాత కూడా సమంత రేంజ్ ఏమాత్రం తగ్గలేదు.. రెమ్యునరేషన్ పరంగానూ సమంత సంచలనాలు సృష్టిస్తోంది. ఒక్కో సినిమాకు 3 కోట్లుపైనే తీసుకుంటుందట.
Read Also : Kanuga Health Benefits : కానుగ చెట్టు ఆరోగ్యానికి అందించే కానుకలు ఇవే..!!
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.