Ram charan: మదర్స్ డే సందర్భంగా చాలా మంది తల్లి పైన వారికున్న ప్రేమను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ప్రముఖులు కూడా వారి ప్రేమను వెల్లిబుచ్చుతున్నారు. తమ తల్లులతో దిగిన పిక్స్ లేదంటే వీడియోస్ ను షేర్ చేస్తూ అభిమానులని అలరిస్తున్నారు.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తల్లితో కలిసి దిగిన క్యూట్ పిక్స్ తో పాటుగా తన తండ్రి పిక్స్ కూడా షేర్ చేశాడు. అంతే కాకుండా అందరి తల్లులకు మాతృదినోత్సవం శుభాకాంక్షలు తెలిపాడు రామ్ చరణ్. రామ్ చరణ్ షేర్ చేసిన ఈ వీడియో అభిమానులను విశేషంగా అలరిస్తోంది.
అమ్మపైన ప్రేమను వ్యక్తం చేసిన తీరును చాలా మందిని ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ ఇలా తన తల్లి గురించి వీడియో షేర్ చేయడం బాగుందని అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ చివరిగా ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో అభిమానులను పలకరించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా భారీ హిట్ అందుకోగా.. ఆచార్య మూవీ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ప్రముఖ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల రామ్ చరణ్ వైజాగ్ వెళ్లగా, కొద్ది రోజుల పాటు అక్కడ షూటింగ్ లో పాల్గొంటాడు. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇదే మొట్ట మొదటి సినిమా కావడంతో దీనిపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయ్యింది.