Khiladi Movie Review : Mass Maharaja Ravi Teja Movie Public Talk on Khiladi Movie
Khiladi Movie Review : మాస్ మహారాజ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్ లుగా తెరకెక్కిన సినిమా ఖిలాడీ.. ఈ సినిమాలో అర్జున్, అనసూయ ఉన్ని ముకుందన్, కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న ( Khiladi Movie 2022 Release) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. కరోనా కల్లోలం సృష్టిస్తున్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలిగింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రివ్యూ ఇప్పుడు తెలుసుకుందాం..
కథ : ఖిలాడీ మూవీ మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మాస్ యాక్షన్ డ్రామాగా అనుకోవచ్చు.
రవితేజ ఈ సినిమాలో పెద్ద ఖిలాడీ గా మోహన్ గాంధీ గ్యాంబ్లర్ పాత్రలో నటించాడు.. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ హీరో అర్జున్ నటించారు. హీరోయిన్ గా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటించారు.. ఒక డబ్బు ఉన్న కంటెయినర్ ను రవితేజ దోచుకోవడంతో ఈ సినిమా కథ స్టార్ట్ అవుతుంది.
ఈ కంటెయినర్ ను అటు పోలీసులు ఇటు విలన్ లు వెతుకుతూ ఉంటారు.. రవితేజ వారికీ ఆ డబ్బు ఉన్న కంటెయినర్ దొరకకుండా వారిని ముప్పు తిప్పలు పెడుతాడు.. మరి చివరకు ఆ కంటెయినర్ ఎవరికీ దొరికింది..? విలన్ కా? పోలీస్ కా? రవితేజ ఆ కంటెయినర్ దొరకకుండా ఎలా కాపాడాడు అనేది కథాంశం.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, పంచ్ డైలాగ్స్ బాగున్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
నటీనటులు : రవితేజ, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి, ఉన్ని ముకుందన్, అనసూయ, అర్జున్ సిబ్బంది : రచన, దర్శకత్వం : రమేష్ వర్మ
సినిమాటోగ్రఫీ : సుజిత్ వాసుదేవ్
నిర్మాత : సత్యనారాయణ కోనేరు
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
ఎడిటింగ్ : అమర్ రెడ్డి కుడుముల
విశ్లేషణ :
సినిమాలో రవితేజ నటన ప్లస్ అయ్యింది.. అయితే రొటీన్ కథ ఈ సినిమాకు మైనస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హై యాక్షన్ సన్నివేశాలు, గ్రిప్పింగ్ సినిమాటోగ్రఫీ హై పాయింట్స్.. అయితే పెద్ద సినిమాలు ఏవీ లేనందున ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఫైనల్ గా ఒకసారి అయితే చూడవచ్చు కానీ రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా చూసి సంతోషంగా బయటకు రాలేరు..
రేటింగ్ : 2.25/5
Read Also : Kajal Aggarwal Baby Bump : కాజల్ అగర్వాల్ బేబీ బంప్‌పై ట్రోల్స్.. సమంత, హన్సిక, మంచు లక్ష్మీ ఇచ్చిపడేశారు..!
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.