Karthika deepam: బుల్లితెరపై ఆధ్యంతం ఉత్కంఠతతో రోజుకో ట్విస్ట్‌తో కొనసాగుతున్న డైలీ సీరియల్ కార్తీకదీపం మరి ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం. మాటల్లో శ్రీవల్లి కోటేష్‌ల నుంచి బుల్లి ఆనందరావు కార్తీక్ దగ్గరకు వెళ్లాడని.. అక్కడే పెరుగుతున్నాడని అప్పారావు ద్వారా మోనిత తెలుసుకుంటుంది. మరి దీప మోనిత వాళ్ల బాబాయ్ ఆపరేషన్ చేయిస్తుందా.. మోనిత ప్లాన్ ఏంటో దీప తెలుసుకుంటుందా అనే విషయాలు చూసేద్దాం.
తన బాబు గురించి నిజం తెలుసుకున్న మోనిత సంబరపడుతూ ఉంటుంది. ‘ఆనందరావుగారు.. మీరు ఈ మమ్మీని వదిలేసి డాడీ దగ్గరకు వెళ్లారా?’ అని మురిసి ముక్కలైపోతుంది మోనిత. ఓ పక్క చీకటి పడుతోంది. మోనిత బాబాయ్‌కి హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. విన్నీ కంగారు పడుతూ ‘బాబాయ్ సార్‌కి నొప్పి వస్తే ఓ టాబ్లెట్ వేయమన్నారు మోనిత మేడమ్’ అంటూ వెతికి ఆ టాబ్లెట్ వేస్తుంది. మోనితకి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది.
మరోవైపు దీప ఆలోచిస్తూ ఉంటుంది. ‘అసలు మోనిత కుట్ర ఏంటీ?’ అనుకుంటూ.. వెంటనే వారణాసికి కాల్ చేసి.. ‘వారణాసీ.. మోనిత వాళ్ల బాబాయ్‌ని ఆపరేషన్ కోసం తీసుకుని వెళ్లారా?’ అంటుంది దీప. ‘లేదక్కా.. రేపన్నారట కదక్కా.. నాతో అరుణా వదిన చెప్పింది’ అంటాడు వారణాసి. దీప.. మనసులో.. ‘అదేంటి డాక్టర్ బాబు ఆపరేషన్ ఇవాళే అని చెప్పారు కదా.. మరి అరుణకు మోనిత రేపు అని ఎందుకు చెప్పింది?’ అని ఆలోచిస్తుంది. వెంటనే దీప కార్తీక్‌కి ఫోన్ చేసి.. ‘డాక్టర్ బాబు మోనిత వాళ్ల బాబాయ్ ఆపరేషన్ ఈరోజా? రేపా’ అంటుంది. ‘నేను డాక్టర్‌ని దీపా.. నాకు లేని ఆత్రం మీ అందరికీ ఎందుకు?’ అంటూ కోపంగా విసుక్కుంటాడు కార్తీక్. ‘అదొక్కటి చెప్పండి డాక్టర్ బాబు.. ఇంకేం అడగను’ అంటుంది దీప. ‘ఈరోజే’ అంటాడు కార్తీక్.
ఇక మోనిత రోడ్డు మీద ఆగి.. కూల్‌గా అప్పారావు మాటలు తలుచుకుంటూ పొంగిపోతుంది. ‘ఆనందరావుగారు.. మీరు సూపరండీ.. అక్కడే ఉండండి.. మమ్మీని డాడీని కలపడానికి మీరే హెల్ప్ చెయ్యాలి.. నా అదృష్టం కొలదీ మా బాబాయ్ తొందరగా పోతే నేను మీ డాడీ మనసు మార్చేసుకుంటాను. మీ దగ్గరకు వచ్చేస్తాను.. ఓకేనా.. మీరు డాడీ దగ్గరకు వెళ్లి భలే పని చేశారండీ’ అనుకుంటుంది. మోనిత ఇంటికి వెళ్లేసరికి దీప వచ్చి మీ బాబాయ్‌ని ఆసుపత్రికి తీసుకెళ్లిందండి అని విన్నీ చెప్తుంది. దానితో మోనిత షాక్ అవుతుంది. ‘నా ప్లాన్ మొత్తం పాడు చేసింది ఆ దీప’ అంటూ మనసులోనే రగిలిపోతుంది.
‘నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను దీపా.. నువ్వు తొందర పడి మంచి పని చేశావ్.. లేదంటే వాళ్ల బాబాయ్‌కి ఏం అయ్యేదో ఏమో.. ఆపరేషన్ చేసి కాపాడగలిగాం.. అతడు సేఫ్..’ అంటూ ఉంటాడు. ఇంతలో మోనిత వచ్చి.. ‘ఏంటి కార్తీక్ ఆపరేషన్ రేపని చెప్పావు కదా.. నాతో చెప్పకుండా బాబాయ్‌కి ఆపరేషన్ చేశావా?’ అంటూ ఎంట్రీ ఇస్తుంది. వెంటనే దీప మోనిత లాగి లాగిపెట్టి కొడుతుంది. మోనిత షాక్ అయిపోతుంది.
బాబాయ్ చనిపోతే దిక్కులేనిదానినయ్యి సింపతీతో కార్తీక్‌కు దగ్గరవ్వాలని ప్లాన్ చేశా అంటుంది మోనిత.
వెంటనే కార్తీక్ ఆవేశంగా మోనితని లాగిపెట్టి కొడతాడు. ‘ఏం అనుకుంటున్నావ్ నా గురించి.? నా మంచితనం నీకు అలుసు అయిపోయిందా? నీ వల్ల నా ఫ్యామిలీ మొత్తం నరకం చూస్తున్నారు.. పదొండేళ్లు మేము దూరం అయ్యాం.. ఇంట్లోంచి బయటికి పారిపోయాం.. ఇప్పటికీ మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వవా? అసలు ఎవరే నువ్వు? నీతో నాకేంటీ? నాతో నీకేంటీ?’ అంటూ అరిచేస్తాడు కార్తీక్.
‘కార్తీక్.. అలా అంటావేంటీ? నేను కూడా నీ భార్యనే కదా?’ అంటూ తాళిని చూపిస్తుంది. వెంటనే దాన్ని గట్టిగా పట్టుకుని లాగి.. ముఖంపై వేసి కొడతాడు కార్తీక్. నా బాబుని నాకు వెతికి పెట్టి ఇవ్వు కార్తీక్.. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను’ అంటుంది మోనిత. ‘ఇదే మాట మీద ఉంటావా’ అంటాడు కార్తీక్. ‘ఉంటాను కార్తీక్’ అంటుంది మోనిత.
‘ఇద్దరూ కొట్టారు కదా.. ఇంతకు ఇంత పగ తీర్చుకుంటాను.. అయినా బాబుని ఎక్కడని వెతుకుతావ్ కార్తీక్.. నీ ఇంట్లోనే ఉన్నాడు.. మీ అమ్మ కోటేష్ వీడియో మీకు చూపించలేదు.. నేను చూపించను.. నీకు ఇప్పట్లో నిజం తెలియదు.. తెలిసేలోగ ఆటను మరింత రసవత్తరంగా మారుస్తాను కదా’ అనుకుంటుంది మోనిత. మొత్తానికీ కొత్త నాటకం, కొత్త కథ ఆరంభించింది. చూడాలి ఎలా సాగుతుందో..మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం!
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.