Categories: LatestTV Serials

Janaki Kalganaledu : జానకిని అవమానించిన జ్ఞానాంబ.. ఆనందంలో మల్లిక..?

Janaki Kalganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

Advertisement

జానకిని టార్గెట్ చేసిన మల్లిక ఇరుగుపొరుగు వారికి మా అత్తయ్య వెళ్లిపోమని చెప్పిన కూడా జానకి సిగ్గులేకుండా ఇక్కడే వేలాడుతూ ఉంది. అసలు జానకి నా తోటి కోడలు కాదు.. పెద్ద తోడేలు అంటూ జానకిని అవమాన పరుస్తుంది మల్లిక. ఆ తర్వాత జానకి దగ్గరకు వెళ్లిన మల్లిక మా అత్తయ్య గారు నేను ఇక్కడ కనిపించకుండా దూరంగా వెళ్ళిపో అని చెప్పింది కదా.

Advertisement

మరి వెళ్లకుండా ఇక్కడే ఉండటానికి సిగ్గు లేదా అనగా మల్లికా మాటలకు కోపం వచ్చిన జానకి మల్లిక ను చెంపపై కొట్టబోతుంది. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ నా ఇద్దరు కోడళ్ళు కొట్టుకోవడానికి రోడ్డు పైకి వచ్చారు అన్న చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నావా అని జానకి పై విరుచుకు పడుతుంది జ్ఞానాంబ.

Advertisement

అనంతరం జ్ఞానాంబ స్వీట్ షాప్ బాధ్యతలు అఖిల్ కి అప్పజెబుతుంది. అప్పుడు జానకి అక్కడికి వచ్చి అత్తయ్య అఖిల్ కు చదువు బాగా ఉంది కాబట్టి తనకు ఇప్పుడే బాధ్యతలు అప్పగించి వద్దు అని అనగా కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నువ్వు ఎవరు అని జానకిని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో జానకి ఎంతో బాధపడుతుంది.

Advertisement

రామచంద్ర కూడా జానకిని చూసి చాలా బాధపడతాడు. ఈ క్రమంలోనే వాళ్ళ అమ్మ గొప్పతనాన్ని గురించి వివరిస్తూ జ్ఞానాంబ చిన్నప్పుడు చేసిన విషయాలు అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత రామచంద్రకు దొరబాబు అనే వ్యక్తి ఫోన్ చేసి పని ఉంది వస్తావా అని అనగా సంతోషంతో రామచంద్ర వస్తాను అని ఒప్పుకుంటాడు. అదే విషయాన్ని జానకికి చెబుతూ పని దొరకడానికి కారణం కూడా మా అమ్మ నే అని ఆనందపడతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..

Advertisement
Advertisement

Recent Posts

Irctc Down : మళ్లీ స్తంభించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్.. టికెట్ బుకింగ్స్‌కు అంతరాయం!

IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…

4 days ago

Earthquake AP : ఏపీలో మళ్లీ కంపించిన భూమి.. ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం..

Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…

1 week ago

Earthquake Nepal : నేపాల్‌లో భూకంపం.. 4.8 తీవ్రతతో భూప్రకంపనలు.. భయాందోళనతో జనం పరుగులు!

Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…

1 week ago

Is Bank Open Today : నేడు బ్యాంకులకు సెలవు ఉందా? డిసెంబర్ 21 హాలీడేనా కాదా? పూర్తి వివరాలివే!

Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…

1 week ago

Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా కన్నుమూత

Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…

1 week ago

This website uses cookies.