...

Janaki Kalganaledu : జానకిని అవమానించిన జ్ఞానాంబ.. ఆనందంలో మల్లిక..?

Janaki Kalganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

జానకిని టార్గెట్ చేసిన మల్లిక ఇరుగుపొరుగు వారికి మా అత్తయ్య వెళ్లిపోమని చెప్పిన కూడా జానకి సిగ్గులేకుండా ఇక్కడే వేలాడుతూ ఉంది. అసలు జానకి నా తోటి కోడలు కాదు.. పెద్ద తోడేలు అంటూ జానకిని అవమాన పరుస్తుంది మల్లిక. ఆ తర్వాత జానకి దగ్గరకు వెళ్లిన మల్లిక మా అత్తయ్య గారు నేను ఇక్కడ కనిపించకుండా దూరంగా వెళ్ళిపో అని చెప్పింది కదా.

మరి వెళ్లకుండా ఇక్కడే ఉండటానికి సిగ్గు లేదా అనగా మల్లికా మాటలకు కోపం వచ్చిన జానకి మల్లిక ను చెంపపై కొట్టబోతుంది. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ నా ఇద్దరు కోడళ్ళు కొట్టుకోవడానికి రోడ్డు పైకి వచ్చారు అన్న చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నావా అని జానకి పై విరుచుకు పడుతుంది జ్ఞానాంబ.

అనంతరం జ్ఞానాంబ స్వీట్ షాప్ బాధ్యతలు అఖిల్ కి అప్పజెబుతుంది. అప్పుడు జానకి అక్కడికి వచ్చి అత్తయ్య అఖిల్ కు చదువు బాగా ఉంది కాబట్టి తనకు ఇప్పుడే బాధ్యతలు అప్పగించి వద్దు అని అనగా కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నువ్వు ఎవరు అని జానకిని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో జానకి ఎంతో బాధపడుతుంది.

రామచంద్ర కూడా జానకిని చూసి చాలా బాధపడతాడు. ఈ క్రమంలోనే వాళ్ళ అమ్మ గొప్పతనాన్ని గురించి వివరిస్తూ జ్ఞానాంబ చిన్నప్పుడు చేసిన విషయాలు అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత రామచంద్రకు దొరబాబు అనే వ్యక్తి ఫోన్ చేసి పని ఉంది వస్తావా అని అనగా సంతోషంతో రామచంద్ర వస్తాను అని ఒప్పుకుంటాడు. అదే విషయాన్ని జానకికి చెబుతూ పని దొరకడానికి కారణం కూడా మా అమ్మ నే అని ఆనందపడతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..