LPG Gas cylinder : వంట గ్యాస్ ధర మరో సారి పెరిగింది. పెరిగిన అన్ని ధరల కారణంగా.. సామాన్య ప్రజలు వంట చేసేందుకే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వైపు పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధర మోత మోగుతుంటే… గృహ వినియోగ సిలిండర్ ధరలను పెంచుతూ… చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కేజీల ఎల్ పీజీ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచాయి. పెంచిన ధరలు శనివారమే అమల్లోకి వచ్చాయి. దీంతో దిల్లీలో సిలిండర్ ధర రూ.999.50కి చేరింది. అదే హైదరాబాద్ లో 14 కిలోల సిలిండర్ ధర రూ.1052 కి చేరింది.
గత కొంత కాలం క్రితమే చమురు సంస్థలు వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి. మే 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.102.50 పెంచటం వల్ల దిల్లీలో రూ.2253గా ఉన్న గ్యాస్ బండ రూ.2355.50కి చేరింది. 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.655కు పెంచారు. ఈ నెల 1న పెరిగిన ధరతో హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,460 నుంచి 2,563.50కి చేరింది. మార్చిలోనూ సిలిండర్‌పై రూ.105 పెంచారు. దీంతో చిరువ్యాపారులు, హోటల్ యజమానులపై భారం పడింది. నెలకు ఐదు సిలిండర్లు వినియోగిస్తే.. రూ.3,000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.