ఇండియన్ సినిమాకు మరోసారి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కోవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్టుతో భారీ చిత్రాలు బాక్ స్టెప్ వేస్తున్నాయి. ఇప్పటికే RRR సినిమా వాయిదా పడింది. తాజాగా రాధేశ్యామ్ సినిమాను కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. RRR సినిమా పోస్టుపోన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన తర్వాత కూడా రాధేశ్యామ్ టీం రిలీజ్ విషయంలో కాన్ఫిడెంట్ గానే ఉంది. కానీ కొద్ది రోజుల్లోనే సీన్ రివర్స్ అయ్యింది. నేషనల్ లెవల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది.
ప్రస్తుతం సిచువేషన్ చూస్తుంటే ఫిబ్రవరిలోనూ సినిమాల రిలీజ్ కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 4న మెగా మల్టీస్టారర్ ఆచార్య రిలీజ్ కావాల్సింది. కిలాడి, మేజర్, భీమ్లా నాయక్ వంటి సినిమాలు కూడా అదే నెలలో డేట్ పిక్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాల రిలీజ్ విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. నార్త్ లోనూ సిచువేషన్ ఇలాగే ఉంది. వరుసగా భారీ చిత్రాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే జెర్సీ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.తాజాగా పృథ్వీరాజ్ మేకర్స్ కూడా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. RRR, రాధేశ్యామ్ సినిమాలు సైడ్ అవ్వడంతో రీజనల్ సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలు ఈ సీజన్ ను టార్గెట్ చేస్తున్నాయి. వీటిలో నాగార్జున,నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా డేట్ లాక్ చేసుకుని ప్రమోషన్ మొదలెట్టేసారు. కానీ రిలీజ్ టైంకి సిచువేషన్ ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు అర్థం కావడం లేదు.
ఆల్రెడీ చాలా రాష్ట్రాల్లో థియేటర్ల ఆక్యుపెన్సీ మీద నిబంధనలు పెట్టేసారు. ఇంకొన్ని రాష్ట్రాలలో థియేటర్లు మూసేశారు. అదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మొదలైతే పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ పరిస్థితిలోనూ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పాన్ ఇండియా సినిమా కు సిద్ధమవుతున్నారు. ఒకవేళ టాలీవుడ్ లోనూ 50% ఆక్యుపెన్సీ అనే కండిషన్ పెడితే ఇన్ని సినిమాలకు థియేటర్స్ సరిపోతాయా అన్న అనుమానాలు కూడా వున్నాయి. అతిథిదేవోభవ, రానా 1945, రౌడీ బాయ్స్, హీరో ఇలా మంచి సినిమాలే సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తున్నాయి. మరి ఇన్ని సినిమాలకు ఛాన్స్ ఉంటుందో లేదో చూడాలి.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.