Allu Arjun : పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ పార్ట్ -1 అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో బన్నీ డైలాగ్స్ ఫుల్ పాపులర్ అయ్యాయి.. బన్నీ స్టయిల్ తో పాటు మూవీలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. పుష్ప హీరోయిన్ రష్మీక మందన కూడా శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ -2 కోసం బన్నీ రెడీ అవుతున్నాడట.. అల్లు అర్జున్ చాలా సరదాగా ఉంటాడు. తన ప్రొఫెషనల్ మాత్రమే కాదు.. మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా.. తీరిక సమయాల్లో తన భార్యాపిల్లలతో కలిసి సరదగా గడిపేస్తుంటాడు.
ఫ్యామిలీకి తప్పకుండా కొంత సమాయాన్ని కేటాయిస్తానడంలో సందేహం లేదు. భార్యా, పిల్లలను ఏదో ఒక వెకేషన్ కు తీసుకెళ్తుంటాడు బన్నీ.. స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్.. 2011లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బన్నీ దంపతులకు అల్లు అర్హ, అల్లు అయాన్ సంతానం.. ఫ్యామిలీని సినీ కెరీర్ బాగానే బ్యాలెన్స్ చేస్తున్నాడు బన్నీ.. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. అందరిలా అల్లు అర్జున్ కూడా స్నేహా రెడ్డి నుంచి కట్నం తీసుకున్నాడా? అంటే.. దీనికి సమాధానం బన్నీ మామ మాటల్లోనే తెలుసుకోవాల్సిందే..
ఆ విషయంలో బన్నీకి 100 మార్కులు వేస్తాను : మామ
అల్లు స్నేహా రెడ్డి తండ్రి అయిన చంద్ర శేఖర్ రెడ్డి విద్యాసంస్థల అధినేత. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు అల్లు అర్జున్ గురించి కొన్ని వాస్తవాలను బయటపెట్టారు. అల్లుడు బన్నీని పొగడ్తలతో ముంచెత్తారు. తన అల్లుడిగా బన్నీకి మాత్రం ఆయన 100 మార్కులు వేస్తానని చెప్పుకొచ్చారు. అల్లు కుటుంబంతో తనకు రిలేషన్ లేనప్పుడు మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమట.. చిరు అభిమానిని అన్నారు. అల్లు అర్జున్ చాలా మంచి వ్యక్తి అన్నారు.
బన్నీ తన సినిమాల కోసం పడే కష్టానికి ఫలితమే వరుస విజయాలన్నారు. ఇంతకీ అల్లు అర్జున్ ఎంత కట్నంగా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.. దానికి చంద్రశేఖర్ తెలివిగా సమాధానమిచ్చారు. బన్నీ అసలు కట్నమే తీసుకోలేదట.. కట్నం తీసుకోవాల్సిన అవసరం బన్నీ లేదన్నారు. ఎందుకంటే.. అల్లువారికే లెక్కలేనంతగా ఆస్తులు ఉన్నాయని, మనం ఇచ్చేది వాళ్ళకి లెక్క కూడా ఉండదన్నారు. అసలు కట్నం తీసుకోవడం అల్లు అర్జున్ ఇష్టం ఉండదట… కట్నానికి అల్లూ వారు పూర్తిగా వ్యతిరేకమని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
Read Also : Jabardasth Promo : వాడు నిన్నేం చేస్తాడులే.. అయ్యో.. అజర్ పరువు తీసిందిగా రీతూ.. వీడియో..!
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.