Prabhas : ఆ విషయంలో పునీత్ రాజ్ కుమార్‌ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన ప్రభాస్..!

Prabhas : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండె పోటుతో ఈ లోకాన్ని వీడి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. ఆయన అకాల మరణంతో కేవలం కన్నడ సినీ పరిశ్రమే కాకుండా యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు చేతన్ కుమర్ దర్శకత్వం వహించగా… కిషోర్ పత్తికొండ నిర్మించారు. అలానే ఈ మూవీలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్, శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించారు.

ఈ చిత్రాన్ని పునీత్ పుట్టిన రోజున మార్చి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ పూర్తై.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సమయంలో పునీత్ రాజ్ కుమార్ ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా నిన్ననే జేమ్స్ మూవీ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేశారు. ఇందులో పునీత్ పాత్రకు ఆయన సోదరుడు శివకుమార్ ఇటీవల డబ్బింగ్ చెప్పారు.

ఈ మేరకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పునీత్ రాజ్ కుమార్‏ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా లో భావోద్వేగ పోస్ట్ చేశారు. ” జేమ్స్ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్ ను అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడు ప్రత్యేకమైనదే. వి మిస్ యూ సర్ ” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read Also : Cashew Benefits for male : వీర్య కణాల కదలికలో జీడిపప్పుదే ప్రధాన పాత్ర..!

admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

4 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

5 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

5 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

5 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

5 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

5 months ago

This website uses cookies.