Madhya Pradesh police arrested the boyfriend after killed his girlfriend at the resort
Viral Video : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రియురాలిని రిసార్ట్‌కు తీసుకెళ్లిన ఓ ప్రేమోన్మాదిని దారుణానికి పాల్పడ్డాడు. రిసార్ట్‌లో జరిగిన యువతి హత్య కేసులో ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆ నిందితుడు తన ప్రియురాలిని ఎందుకు చంపాల్సి వచ్చిందో వీడియో కూడా రిలీజ్ చేశాడు.
ప్రియురాలిని తానే చంపిన విషయాన్ని వీడియోలో చెప్పాడు. ఆ వీడియోను సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. జబల్పూర్‌లోని రిసార్ట్‌లో అభిజిత్ పాటిదార్ అనే వ్యక్తి తాను ప్రేమించిన యువతితో రిసార్ట్‌కు వెళ్లాడు. మరుసటిరోజు ఆ యువతి రక్తపు మడుగులో పడి ఉంది.
అనంతరం ప్రియుడు కనిపించకుండా పోయాడు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మర్డర్ మిస్టరీని చేధించారు. తనను బ్లాక్‌మెయిల్ చేసిందనే కోపంతోనే ఆమెను హత్య చేసినట్టు ప్రియుడు పోలీసులకు వెల్లడించాడు. ఫోన్ సిగ్నల్, కాల్‌డేటా ఆధారంగా యువతి హత్య జరిగిన రిసార్ట్‌కి పోలీసులు చేరుకున్నారు.
నిందితుల వీడియోల ఆధారంగా హత్య చేసింది ఎవరో గుర్తించారు. తాను ప్రేమిస్తే నమ్మకద్రోహం చేయడమే కాకుండా బ్లాక్‌మెయిల్ చేసిందంటూ అందుకే ఆమెను హత్య చేసినట్టు వీడియోలో అభిజిత్ పాటిదార్ వెల్లడించాడు. ఆ తర్వాత ఆ వీడియోను డిలీట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
Read Also : Geethu Royal : నాగార్జునపై గీతూ రాయల్ షాకింగ్ కామెంట్స్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి అందుకే ఎలిమినేట్ అయ్యాను..!
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.