వ్యాపార వేత్త సుఖేశ్ చంద్రశేఖర్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు చుక్కెదురైంది. ఈమెకు 7.27 కోట్ల ఫిక్స్ డు డిపాజిట్ ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఈ కేుసలో ప్రధాన నిందితుడైన సుఖేశ్ చంద్ర శేఖర్.. అతడి భార్య, నటి లీమా మరియూ పాల్ తో పాటు ఆరుగురి పేర్లను ఛార్జ్ షఈట్ లో చేర్చారు. అయితే ఇందులో జాక్వెలిన్ కు కూడా వీరు విలువైన కానుకలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందరన్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానంటూ నమ్మించి వారి భార్యల దగ్గర ఏకంగా 200 కోట్ల రూపాయలు వసూలు చేశాడు సుఖేశ్ చంద్రశేఖర్. అయితే శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పిర్యాదు మేరకు దిల్్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం కేసు నమోదు చేసింది. రూ.200 కోట్ల దోపిడీ కేసులో చంద్రశేఖర్ సన్నిహితుడు లీనా మరియా పాల్ సహా.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ ప్రశ్నించింది. తిహాడ్ జైలు నుంచే కాలర్ ఐడీ స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సుకేశ్ చంద్రశేఖర్ సంప్రదించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
తన గుర్తింపును దాచి పెట్టి, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు. అతడిని జాక్వెలిన్ నమ్మటం ప్రారంభించిన క్రమంలో.. ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని చెప్పారు. సుకేశ్‌కు సంబంధించిన 20కిపైగా కాల్ రికార్డులు ఈడీ దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూ.200 కోట్ల దోపిడీ కేసులో దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ) విచారణ కొనసాగిస్తోంది. సుకేశ్ చంద్రశేఖర్, లీనా పాల్‌పై దేశవ్యాప్తంగా 23 చీటింగ్ కేసులు ఉన్నాయి.
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.