Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
సౌందర్య కుటుంబం గుడికి అని బయలుదేరుతుండగా ఇంతలో ఆనందరావు హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ విషయాన్ని సౌందర్య అల్లుడు సత్య కు తెలియజేస్తుంది. అప్పుడు సత్య హాస్పిటల్ వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంటాను అనగా అప్పుడు సౌర్య ఎందుకు సార్ నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి ఆటోలో తీసుకెళ్తుంది.
మరొకవైపు ఆనందరావు హెల్త్ కండిషన్ చెక్ చేసిన నిరూపమ్ బాగానే ఉంది అని చెప్తాడు. అలాగే తాతయ్య ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అని సౌందర్యకు చెబుతాడు నిరూపమ్. ఇంతలో అతడికి ప్రేమ్ రావడంతో కొద్దిసేపు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు సౌందర్య హిమ,సౌర్య ఎప్పటికైనా కలుస్తారు అని అనడంతో అప్పుడు ప్రేమ్ నాకు నమ్మకం లేదు అని అంటాడు. అప్పుడు ఏంటిరా ప్రేమ్ అలా మాట్లాడుతున్నావు అని అంటుంది. మరొకవైపు ఆనందరావు హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుతూ మీకు ఎవరు లేకపోతే ఏమిటి మీ ఫోటోగ్రాఫర్ మనవడు ఉన్నాడు, డైలీ ఉదయాన్నే జాగింగ్ కి తీసుకొని వెళతాను అని ధైర్యం చెబుతాడు ప్రేమ్.
ప్రేమ్ బయట నిలబడి ఉండగా ఇంతలో అక్కడికి సత్యా,జ్వాల ఇద్దరు వస్తారు. ఏంటి చీప్ గా ఆటోలో వచ్చావా అని ప్రేమ్ అనడంతో వెంటనే జ్వాల ప్రేమ్ కాలర్ పట్టుకుంటుంది. అలా వారి మధ్య కొద్దిసేపు ఫన్నీగా యుద్ధం జరుగుతుంది. ఇంతలో అక్కడికి హిమ రావడంతో ఏ తింగరి నువ్వు డాక్టర్ వా అని అడుగుతుంది జ్వాల.
ఈ క్రమంలోనే నిరూపమ్ జ్వాల గురించి గొప్పగా మాట్లాడటంతో నిరూపమ్ మాటలకు జ్వాలా ఫిదా అవుతుంది. మరొకవైపు చనిపోయిన మా అమ్మా నాన్నల పేరుమీద అన్నదానం చేయండి అంటూ సౌర్య గుడిలో అన్నదాన కార్యక్రమం చేయిస్తుంది.
ఇంతలో అక్కడికి వచ్చిన సౌందర్య చనిపోయిన నా కొడుకు కూతురు పేరు మీద అన్నదానం చేయించండి అని చెప్పడంతో ఇందాకే ఒక అమ్మాయి వచ్చి పేర్ల మీద అన్నదానం చేయించమని చెప్పింది అని సౌందర్యకు పంతులుగారు చెప్పడంతో అది హిమ నే అని గ్రహించిన సౌందర్య వెంటనే సూర్య జాడ కోసం వెతుకులాట మొదలు పెడుతుంది.రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.