Ponniyin Selvan-1 Movie Review : తమిళ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam) డైరెక్షన్‌లో తమిళ బాహుబలిగా రూపొందిన మూవీ పొన్నియిన్ సెల్వన్. ఈ మూవీ భారీ అంచనాలతో శుక్రవారం (సెప్టెంబర్ 30న) థియేటర్లలో రిలీజ్ అయింది. మూవీ మణిరత్నంకు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీని ఎప్పటినుంచో తెరకెక్కించాలనుకున్నాడు. ఎట్టకేలకు మణిరత్మం డ్రీమ్ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మన తెలుగు బాహుబలి మాదిరిగా ఈ మూవీని కూడా రెండు పార్టులుగా నిర్మించనున్నారు. ఫస్ట్ పార్ట్ ఇప్పడు రిలీజ్ చేశాడు మణిరత్నం. ఈ మూవీలో విలక్షణ నటుడు విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, జయం రవి, శోభిత ధూళిపాల, ఆర్. పార్తిబన్ , ప్రభు, ఆర్. శరత్ కుమార్, జయరామ్, ప్రకాష్ రాజ్, విక్రమ్ ప్రభు, రెహమాన్ నటించారు. మూవీకి మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.
మద్రాస్ టాకీస్ లైకా ప్రొడక్షన్స్ సంస్థపై మణిరత్నం, శుభస్కరన్ అల్లి రాజా నిర్మాతలుగా వ్యవహరించారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా.. భారీ అంచనాలతో ఈ మూవీ తమిళంలోనే కాదు.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..
నటినటులు వీరే (Cast) : కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్, విక్రమ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాల, విక్రమ్ ప్రభు, ప్రభు, ఆర్. శరత్ కుమార్, జయరామ్, ఆర్. పార్తిబన్, ప్రకాష్ రాజ్, రెహమాన్ తదితరులు నటించారు.
Movie Name : | Ponniyin Selvan-1 (2022) |
Director : | మణిరత్నం |
Cast : | విజయ్ దేవరకొండ,అనన్య పాండే,రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను |
Producers : | మణిరత్నం, శుభస్కరన్ అల్లి రాజా |
Music : | ఏఆర్ రెహమాన్ |
Release Date : | 30 సెప్టెంబర్ 2022 |
స్టోరీ (Story) ఇదే :
అది.. 10వ శతాబ్దం.. అప్పట్లో చోళరాజుల చరిత్రను చెబుతుంది. ఆదిత్య కరికాలన్ (విక్రమ్), నందిని (ఐశ్వర్యరాయ్), కుందవై పిరిత్తియార్ (త్రిష) పాత్రలో కనిపించారు. పరాంతక చోళుడుకు ఆదిత్య కరికాలన్, అరుల్ మొలి వర్మన్ కుందవై అనే ముగ్గురు సంతానంగా చూపించారు. అయితే అదిత రాజు బంగారు భవనాన్ని నిర్మిస్తాడు. తండ్రిని బంగారు భవనంలో ఉండాల్సిందిగా కోరుతాడు. మిత్రుడు అయిన వందియతేవన్ సాయంతో కబురు పంపుతాడు. అయితే వెళ్లే దారిలో వందియతేవన్ కదంపూర్ భవనంలో కాసేపు బస చేస్తాడు. అక్కడే చోళ రాజ కోశాధికారి పలువెట్టయ్య కరికాలపై చేసిన కుట్ర గురించి తెలుస్తుంది.
ఆపై ఉత్తరాన్ని పరాంతక చోళుడికి చేరుస్తాడు. తమ్ముడు అరుల్ కూడా తీసుకొని రావాల్సిందిగా కుందావై వందియతేవన్ శ్రీలంకకు పంపిస్తుంది. అరుల్ మొలివర్మన్‌ను బందీగా చేయాలని పలువెట్టరైయార్ శ్రీలంకకు రెండు ఓడలను పంపిస్తాడు. అరుల్‌ను తీసుకొని వస్తున్న సమయంలో సముద్రంలో తుఫానులో ఓడలు చిక్కుకుంటాయి. అప్పుడే ఒక జాలరి వారిని కాపాడుతుంది. అరుల్ గాయపడతాడు. దాంతో అతడికి చికిత్స అందించేందుకు బౌద్ధ మందిరానికి తీసుకెళ్తారు.
పినతండ్రి మధురాంతకన్‌ను గద్దె ఎక్కించేందుకు పలువెట్టయార్ కుట్రలు పన్నుతుంటాడు. పథకం ప్రకారమే.. కదంబూర్‌లోని భవనంలోకి ఆదిత్య కరికలన్‌ను రప్పించి హత్య చేస్తారు. ఈ హత్య నేరం వందియతేవన్‌పై పడేలా చేస్తారు. ఆ తర్వాత వందియతేవన్ ఎలా ఆ సమస్య నుంచి బయటపడతాడు.. ఇంతకీ పలువెట్టయార్ ఏమయ్యాడు? వందియతేవన్, కుందవై మధ్య లవ్ ట్రాక్ ఏంటి అనేది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే..
ఈ మూవీలో అద్భుతమైన సన్నివేశాలను తెరకెక్కించారు. రెహమాన్ మ్యూజిక్ సూపర్.. యాక్షన్ సీన్లు కూడా అద్భుతంగా వచ్చాయి. సినిమాటోగ్రఫీ బాగానే అనిపించింది. ఇక నటీనటుల విషయానికి వస్తే.. పోటాపోటీగా నటించారు. మూవీలో మైనస్ పాయింట్స్ చూస్తే.. మూవీని బాగా సాగదీసినట్టుగా కనిపించింది.
టెక్నికిల్ విభాగం చూస్తే.. మణిరత్నం మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. ఏ పాత్రకు ఎవరూ సరిపోతారో నటులను ఎంచుకున్నాడు. ఎవరికి వారు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారనే చెప్పాలి. మొత్తం మీద చూస్తే.. పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1 భారీ తారాగణంతో రావడంతో మూవీపై ఎక్కడలేని హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీని ప్రతిఒక్కరూ ఫ్యామిలీతో వెళ్లి చూసే సినిమా.. బాహుబలి మూవీ తరహాలో ఉండటంతో అందరూ చూడవచ్చు.
[Tufan9 Telugu News ]
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ -1
మూవీ రివ్యూ & రేటింగ్ : 3.5/5
Read Also : Naga Chaitanya Marriage : చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో నాగ చైతన్య పెళ్లంట..?!
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.