Guppedantha Manasu Oct 28 Today Episode : తెలుగు బుల్లి తెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి గౌతమ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి తన గదిలో గౌతమ్ తో కలిసి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ కంటతడి పెట్టుకుని ఎమోషనల్ అవుతూ ఉండగా ఆ మాటలు అన్నీ వసుధార వింటూ ఉంటుంది. నాకు మా డాడ్ కన్నా ఎవరు ఎక్కువ కాదు. చిన్నప్పుడు నేను ఏ రెండు అక్షరాల కోసం అయితే తపన పడ్డాను ఆ రెండు అక్షరాలే ఇప్పుడు నన్ను వాళ్లకు దూరం చేశాయి అని బాధపడుతూ ఉంటాడు.
నాకంటూ జీవితంలో తోడుగా ఉన్నది వసు మాత్రమే వసుధార కూడా వెళ్లిపోతే అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో వసు వచ్చి ఆ మాటలు మాట్లాడొద్దు అని చెబుతుంది. అప్పుడు రిషి నువ్వు నా మీద అంత ప్రేమను చూపిస్తున్నావు కదా అలాంటప్పుడు ఒక్క విషయంలో ఎందుకు అంత మొండి పట్టి పడుతున్నావు వసుధార.
నేను కూడా ఒకప్పుడు రిషి లాగా కాకుండా నేను కూడా కొన్ని మెట్లు దిగాను మా డాడ్ కోసం అని అంటూ ఉండగా మీ పొగరుకు బుద్ధి లేదు సార్ లెగండి పెళ్లి పడుకోండి రెస్ట్ తీసుకోండి అని అంటుంది. అప్పుడు రిషికి వసుధర ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయే మెట్లపై కూర్చుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. వైపు జగతి దంపతులు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు.
ఇక మరుసటి రోజు ఉదయం ధరణి వంట చేస్తూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి రిషికి కాఫీ ఇచ్చావా అని అడగగా లేదు అత్తయ్య అన్నటంతో సీరియస్ అవుతుంది దేవయాని. అప్పుడు కాఫీ ఇవ్వాలని తెలియదా అని రిషి ప్రేమతో కాఫీ కలుపుకొని తీసుకొని వెళుతూ ఉండగా ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు.
అప్పుడు రిషి అటు ఇటు చూస్తూ వసుధార తాగిందా వదిన అని అడగగా లేదు అనటంతో సరే పెద్దమ్మ నేను కాఫీ తీసుకొని వెళ్తాను అని ఆ కాపీని తీసుకొని వెళ్తాడు. దాంతో రిషి ప్రవర్తనకు దేవి అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ధరణి లోపల నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత వసుధార గదిలో జగతి కి మెయిల్ చేస్తూ జగతి వచ్చి తనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంచుకొని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి వస్తాడు.
అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు అని అనగా ఏం లేదు సార్ అని అంటుంది వసుధార. ఆ తర్వాత వారిద్దరు కలిసి ప్రేమగా మాట్లాడుకుంటూ రిషి తెచ్చిన కాఫీ ని షేర్ చేసుకొని తాగుతూ ఉంటారు. ఆ తర్వాత వసు బయటికి వెళ్తూ ఉండగా దేవయాని ఆపి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా జాగ్రత్తగా వెళ్ళు ఆరోగ్యం జాగ్రత్త అని అంటుంది. అప్పుడు జగతి మేడం నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానా అని మీరు ఆశగా ఎదురు చూస్తున్నారు అని నాకు తెలుసు.
కానీ నేను ఇంటి నుంచి వెళ్లడం లేదు రిషి సార్ ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను అని అంటుంది. అప్పుడు వసుధార మాటలకు దేవయాని కోప్పడగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. ఏమైంది పెద్దమ్మ ఎందుకు అరుస్తున్నారు అని అనగా ఏమీ లేదు సార్ నేను ఇక్కడ నుంచి వెళ్తాను అంటే మేడం వద్దు ఇక్కడే ఉండు వసుధర అంటుంది అంటూ దేవయాని ని అడ్డంగా ఇరికిస్తుంది.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.