G
Telugu News » TV Serials » tulasi family get happy in todays intinti gruhalakshmi serial episode
⚡ TV Serials, Latest, Trending

Intinti Gruhalakshmi Sep 13 Today Episode : సామ్రాట్ ని అవమానించే విధంగా మాట్లాడిన అభి.. సంతోషంలో తులసి కుటుంబం..?

Intinti Gruhalakshmi September 13 Today Episode, Intinti gruhalakshmi 13-9-2022 episode,ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ఎ పిసోడ్, telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Intinti Gruhalakshmi September 13 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో పూజ పూర్తి అయినందుకు అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో తులసి హడావిడిగా ఉండగా ఇంతలో అంకిత,ప్రేమ్ దంపతులు అక్కడికి వచ్చి తులసికి సామ్రాట్ విషయంలో సలహా ఇస్తూ ఉంటారు. ఇక వారందరూ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే సామ్రాట్ అక్కడికి వచ్చి వారి మాటలు వింటూ ఉంటాడు. నందు లాస్య కూడా వారు మాట్లాడుతున్న మాటలను చాటుగా వింటూ ఉంటారు.

Intinti Gruhalakshmi September 13 Today Episode tulasi family get happy in todays intinti gruhalakshmi serial episode

అప్పుడు తులసి వారికి నచ్చ చెబుతూ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు అందరూ కలిసి ఆనందంగా ఉండగా అనసూయ ఇన్ డైరెక్ట్ గా లాస్య మీద పంచులు వేస్తూ ఉంటుంది. దాంతో అందరు సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు.

Advertisement

అందరూ నవ్వుకుంటూ ఉండగా అది చూసిన సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఇల్లు అంటే ఇదిరా అనుబంధాలు అంటే ఇవి అని అంటాడు. ఆ తర్వాత లక్కీ ఆంటీ ఉండ్రాళ్ళు వినాయకుడికి ఎందుకు నైవేద్యంగా పెడతారు అని అడగగా అప్పుడు తులసి వినాయకుడి కి ఉండ్రాళ్ళను ఎందుకు పెడతారు అన్న విషయం గురించి గొప్పగా చెబుతుంది.

Intinti Gruhalakshmi Sep 13 Today Episode : సంతోషంలో తులసి కుటుంబం..?

ఆ తర్వాత సామ్రాజ్ చెయ్యి కడుక్కుంటూ ఉండగా తులసి అక్కడికి వెళ్లి చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తుంది. అప్పుడు సామ్రాట్ తులసికి క్షమాపణలు చెబుతాడు. అప్పుడు సరే ఇంకా బయలుదేరుతాను తులసి గారు అని సామ్రాట్ అనగా ఇంతలో దివ్య అక్కడికి వచ్చి ఈరోజు మీరు ఇక్కడే ఉండండి అంకుల్ రాత్రికి ప్రోగ్రాం ఉంటుంది అని అంటుంది.

ఆ మాటలు వింటున్న నందు, లాస్య లు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆ తర్వాత నందు లాస్య ఇద్దరు మేము వెళ్తున్నాం అభి అని అభికి చెప్పగా అదేంటి డాడీ ఈవినింగ్ పార్టీ ఉంది కదా అని అనడంతో వెంటనే లాస్య వద్దులే ఇప్పటికే పిలవకుండా వచ్చినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నాము అని అనగా అప్పుడు అభి నందు నీ ఉద్దేశించి మాట్లాడుతూ నందుని అవమానించే విధంగా మాట్లాడతాడు.

ఆ తర్వాత పార్టీ మొదలవుతుంది. ఇంట్లో అందరూ పార్టీ జరుపుకుంటూ ఉంటారు. అప్పుడు, అభి, అంకిత మీద తనకు ఎంత ప్రేమ ఉందో అందరి ముందు చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ్, శృతి అందరి ముందే సీరియస్గా గొడవ పడుతూ ఉంటారు.

Read Also : Intinti Gruhalakshmi: అందరి ముందు నిజాన్ని బయట పెట్టేసిన సామ్రాట్.. షాక్ లో తులసి, నందు..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷divyaIntinti Gruhalakshmilasyanandutulasi
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు