G
Telugu News » TV Serials » tulasi apologises to samrat when he lashes out at her in todays intinti gruhalakshmi serial episode
⚡ TV Serials, Latest, Trending

Intinti Gruhalakshmi Aug 18 Today Episode : రెస్టారెంట్లో ఎంజాయ్ చేస్తున్న తులసి,సామ్రాట్.. కోపంతో రగిలిపోతున్న నందు..?

Intinti Gruhalakshmi Aug 18 Today Episode,ఇంటింటి గృహలక్ష్మి సీరియల్,telugu news,తులసి,సామ్రాట్,నందు

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Intinti Gruhalakshmi Aug 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి కనిపించకపోవడంతో సామ్రాట్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో తులసి కనిపించకపోయేసరికి తులసి అంటూ గట్టిగా అరుస్తాడు సామ్రాట్. ఇంతలోనే తులసి అక్కడికి వచ్చి నన్ను అక్కడికి వెళ్లదు అని చెప్పి మీరు ఎందుకు వెళ్తున్నారు అని అనగా సామ్రాట్ టెన్షన్ తో తులసి పై కోప్పడతాడు. వరకు ఇక్కడే ఉన్నారు మళ్ళి ఇంతలోనే ఎక్కడికి వెళ్లావు అంటూ తులసి పైర్ అవుతాడు. అప్పుడు తులసి సముద్రంలో నీళ్లలో ఆడినందుకు వేడిగా మొక్కజొన్న తినాలనిపించింది.

Tulasi apologises to Samrat when he lashes out at her in todays intinti gruhalakshmi serial episode

Intinti Gruhalakshmi Aug 18 Today Episode :  తులసి,సామ్రాట్.. కోపంతో రగిలిపోతున్న నందు..

మీ దగ్గరికి వస్తే మీరు ఫోన్ మాట్లాడుతున్నారు అందుకే నేను వెళ్లి తీసుకు వచ్చాను అని అనటంతో అప్పుడు సామ్రాట్ కాస్త కూల్ అయ్యే తులసి తో ప్రశాంతంగా మాట్లాడుతాడు. ఇంతలోనే నందు లాస్య దంపతులు వారికి ఎదురవుతారు. మరొకవైపు ప్రేమ్ మాట్లాడిన మాటలను తలుచుకొని అంకిత బాధపడుతూ ఉంటుంది.

Advertisement

ఇద్దర్నీ ఎలా అయినా కలపాలి కానీ అది తన వల్ల కాదు ఇద్దరిని కలపాలి అంటే ఆంటీ ఒక్కరే.. ఆంటీ ఇంటికి వచ్చిన తర్వాత అసలు విషయం చెప్పేస్తాను అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే అంకితకు అర్జెంటుగా ఫోన్ రావడంతో అక్కడి నుంచి బయలుదేరుతుంది. అప్పుడు అభి మామ్ కూడా ఇంట్లో లేదు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అనగా నేను వెళ్లి తీరాల్సిందే అని అంటుంది అంకిత.

ఒకవైపు నందు, లాస్యలు సామ్రాట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు లాస్య మీ విషయంలో నేను ఒక బిట్టు కాసాను. నేనే గెలిచాను అని అనగా వెంటనే సామ్రాట్ ఏం పందెం వేశారు అని అడగడంతో, మీరు నేను బీచ్ కి వెళ్తాను అనుకున్నాను, నందు ఏమో గుడికి వెళ్తారు అని అన్నాడు తీరా మీరు చూసేసరికి బీచ్ లో ఉన్నారు నేనే గెలిచాను అని అంటుంది లాస్య.

వైజాగ్ వచ్చిన ఏ కపుల్స్ అయినా బీచ్ కి రాకుండా ఉంటారా అని అనటంతో తులసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత లాస్య మల్లెపూలు తీసుకొని వచ్చి తులసికి ఒక అప్పుడు తులసి నేను తీసుకోను అని గట్టిగా అంటుంది. అప్పుడు సామ్రాట్ తీసుకోమని చెప్పడంతో తులసి, జడలో పూలు పెడుతుంది లాస్య. మరొకవైపు శృతి వాళ్ళ అత్తయ్య కౌసల్య ప్రేమ్ విషయంలో తొందర పడ్డావు అవన్నీ మర్చిపోయి ప్రేమ్ తో కలిసి ఉండమని చెప్పడంతో నేను ఉండలేను అని అంటుంది శృతి.

Read Also : Intinti Gruhalakshmi Aug 17 Today Episode : తులసి కోసం కొట్టుకున్న నందు,సామ్రాట్.. టెన్షన్ పడుతున్న తులసి..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷divyaIntinti Gruhalakshmilasyanandupreamsamrattulasi
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు