G
Telugu News » TV Serials » soundarya fire on swapna in todays karthika deepam serial episode
⚡ TV Serials

Karthika Deepam: స్వప్నఫై మండిపడ్డ సౌందర్య.. బాధతో కుమిలిపోతున్న హిమ..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో జ్వాలా చేతి పై ఉన్న పచ్చబొట్టును చూసి హిమ ఆనందంతో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది.

జ్వాలా చేతి పై ఉన్న పచ్చబొట్టును చూసి ఎవరిది ఈ పేరు అని ప్రేమ్ అడగగా నా శత్రువుది అని చెప్పడంతో హిమ ఒక్కసారిగా బాధపడుతుంది. అంతేకాకుండా జ్వాలా, ప్రేమ్,నిరూపమ్ ముగ్గురు కలిసి మాట్లాడుతుండగా అదంతా పక్కనుంచి హిమ వింటూ నాపై నీకు ఇంకా కోపం తగ్గలేదా సౌర్య అని మనసులో హిమ అనుకుంటూ అక్కడి వెళ్ళిపోతుండగా అప్పుడు జ్వాలా పిలిచి ఏంటి తింగరి తప్పకుండా వెళ్లి పోతున్నావు అని అంటుంది.

Advertisement

ఆ తరువాత హిమ అక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్లి ఆనందంతో కార్తీక్, దీప ల ఫోటోల దగ్గరకు వెళ్లి నాన్న నాకు సౌర్య కనిపించింది అని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీ ఇద్దరి చావుకు నేనే కారణం అయ్యాను డాడీ అని హిమ కుమిలి పోతూ ఉంటుంది. ఎలా అయినా సౌర్య కు తన పైన కోపం తగ్గించెలా చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

అలాగే నేను,సౌర్య ఎప్పటిలాగే కలిసి ఉండేలా దీవించండి అనే కార్తీక్ దీప ల ఫోటోలు చూస్తూ ఎమోషనల్ అవుతుంది హిమ. మరొకవైపు ఆనందరావు సౌందర్య స్వప్న ఇంటి బయట మాట్లాడుతూ ఉండగా, అప్పుడు స్వప్న సౌందర్యను ఇంటిలోపలికి రావద్దు అని ముఖంమీద చెబుతుంది. స్వప్న మాటలకు మండిపడ్డ సౌందర్య స్వప్నను చెడామడా తిట్టేస్తుంది.

Advertisement

అంతేకాకుండా నేను నీ కన్న తల్లిని నీ కంటే నాకు ఎక్కువ పౌరుషం రోషం ఉన్నాయి అని అంటుంది. అలా కొద్దిసేపు సౌందర్య, స్వప్న ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరొకవైపు జ్వాలా తన చేతి పై ఉన్న పచ్చబొట్టును చూస్తూ బాధపడుతూ ఉంటుంది. మెడికల్ క్యాంపు లో ప్రేమ్ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని హిమ ఫై మరింత కోపం తెచ్చుకుంటుంది. ఇంతలో అక్కడికి హిమ వస్తుంది.

అప్పుడు సౌర్య ఈ సమయంలో వచ్చావు నీకు భయం వేయలేదా అని అడగగా నువ్వే నా ధైర్యం అని చెప్పడంతో సౌర్య షాక్ అవుతుంది. అప్పుడు హిమ నువ్వే నాకు ఈ ధైర్యాన్ని నేర్పించావు అని అంటుంది. ఇంతలో ఇంద్రమ్మ దంపతులు అక్కడికి రావడంతో సౌర్యను ఇంద్రమ్మ దంపతుల దగ్గరికి చేర్చావా దేవుడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

ఇంద్రమ్మ దంపతుల చూసిన హిమ ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు తెచ్చుకుంటుంది. ఆ తరువాత అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. అప్పుడు సౌర్య తింగరి నీకు ఏం కూర అంటే ఇష్టం అని అడగగా, దోసకాయ పచ్చడి అని అంటుంది హిమ. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷himakarthika deepamsoundaryasourya
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు