Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Janaki Kalaganaledu: జానకిని క్షమించమని కోరిన రామచంద్ర.. జానకిని తప్పుగా అపార్థం చేసుకున్న జ్ఞానాంబ..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జాగ్రత్తగా సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..జ్ఞానాంబ ఫై కేసును వెనక్కి తీసుకోమని జానకి వాళ్ళ అన్నయ్యను వేడుకుంటూ ఉంటుంది.

యోగి,జానకి ఎంత చెప్పినా కూడా వినకుండా జ్ఞానాంబ తగిన శిక్ష పడింది అని మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా జ్ఞానాంబ సీక్రెట్ గా కంప్లైంట్ రాసి ఇవ్వు నువ్వు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు నేను చూసుకుంటాను అని జానకిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్తాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత మీ అత్తయ్య నిన్ను ఎన్ని కష్టాలు పెట్టిందో ఎన్ని మాటలు అనిందో ఎస్ఐ గారికి చెప్పు అని జానకితో చెబుతాడు యోగి.

Advertisement

అప్పుడు జానకి మాట్లాడుతూ మా అత్తయ్య గారు నిజంగానే నన్ను చాలా బాధ పెట్టారు, ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు ఇవన్నీ కూడా మా అత్తయ్య గారు భరించలేనంత ప్రేమతో చేశారు అని అనడంతో జ్ఞానాంబ కు జానకి పై కోపం తగ్గుతుంది. జానకి మాటలకు జ్ఞానాంబ కుటుంబ సభ్యులు ఆనందం తో ఉంటారు.

అప్పుడు జానకి ఎస్ఐ తో మాట్లాడుతూ మా అన్నయ్య మీకు ఇచ్చిన కంప్లెన్ట్ లో ఏ మాత్రం నిజం లేదు అని చెబుతుంది. ఆ తరువాత జ్ఞానాంబ కాళ్ళు పట్టుకుంటుంది జానకి. అప్పుడు జానకిని మరింత అపార్థం చేసుకున్న జ్ఞానాంబ నువ్వు చేసిన ఈ అవమానం నేను బ్రతికినంత కాలం గుర్తు పెట్టుకుంటాను అని అంటుంది.

ఆ తర్వాత జానకి రామచంద్రలు ఇంటికి వెళుతూ తోటలో ఒక దగ్గర ఆగి రామచంద్ర తాను చేసిన తప్పు చేశాను క్షమించమని జానకిని అడుగుతాడు. అప్పుడు జానకి మీరు ఏ తప్పు చేయలేదు మీ స్థానంలో ఎవరు ఉన్నా అలాగే చేస్తారు అని అంటుంది. అలా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత ఇంటికి బయలుదేరుతారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Exit mobile version