G
Telugu News » TV Serials » janaki revel mallika super plan in todays janaki kalaganaledu serial episode
⚡ TV Serials

Janaki Kalaganaledu: అడ్డంగా బుక్కయిన మల్లిక..జ్ఞానాంబ ఏం చేయనుంది..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్ప  

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

జ్ఞానాంబ దంపతులు వెన్నెలా నిశ్చితార్థానికి దిలీప్ ఫ్యామిలీ అందరిని రమ్మని చెప్పు అని రామచంద్రకు చెబుతుంది. ఈ మాటలన్నీ మల్లిగా గోడ చాటున వింటూ ఉంటుంది. అది చూసి గోవిందరాజు తిట్టి పంపిస్తాడు. మరొకవైపు జానకి నాటు వైద్యుడు ఇచ్చిన మందులు ల్యాబ్ చెక్ చేయించి తనపై విషప్రయోగం చేయడానికి అలా చేశారు అన్న విషయాన్ని గ్రహించుకుంటుంది.

జానకి పోలీస్ లను పిలుచుకొని దొంగ నాటు వైద్యుడు దగ్గరకి వెళ్తుంది. అప్పుడు జానకీ ఎందుకు అలా మోసం చేస్తున్నావు అసలు విషయం చెబుతావా లేకుంటే పోలీస్ స్టేషన్ లో కూర్చుంటావా అని బెదిరించగా అతడు జరిగిందంతా వివరిస్తాడు. మీ తోటి కోడలు మంచిగా ఇదంతా చేయించింది అని చెప్పగా జానకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే జానకి ఇంటికి వెళ్లి మల్లికా నిలదీస్తూ ఉండగా ఇంతలో అక్కడికి జ్ఞానాంబ దంపతులు రామచంద్ర వస్తారు.

ఏమి అయ్యింది అని అడగగా అప్పుడు జానకి మాట్లాడుతూ అత్తయ్య గారు ఆ నాటు వైద్యుడు ఇచ్చిన మందులు మంచివి కాదు అని చెబుతుంది. జానకి ఎక్కడ అసలు విషయం చెప్పెస్తుందో అని మల్లికా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తరువాత మల్లికా ఇంట్లోకి వెళ్లి టెన్షన్ పడుతూ ఉండగా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే అత్తయ్య గారికి చూపిస్తాను అని జానకి. మరొకవైపు వెన్నెల దిలీప్ తో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా వెనుక వైపు నుంచి మల్లిగా వింటూ ఉంటుంది.

ఇంతలో మల్లిక రావడం గమనించిన వెన్నెల కాల్ కట్ చేసి చెప్పండి వదిన అని అనగా కన్నబాబు ద్వారా నువ్వు ప్రేమించిన అబ్బాయి నెంబర్ తీసుకున్నాను, ఎలాగైనా నీ నేను పెళ్లి జరిపిస్తాను అని వెన్నెలతో అనగా వెంటనే వెన్నెల కంగారుపడుతూ దిలీప్ కి ఫోన్ చేస్తుంది. వారిద్దరూ ఫోన్లో మాట్లాడుతుండటం చాటుగా మల్లిక వింటుంది. పెళ్లి వెనుక ఇంత పెద్ద కథ నడుస్తుందా అసలు విషయం జ్ఞానాంబ కు చెబుతాను అని అనుకుంటూ ఉంటుంది.

మరొకవైపు జ్ఞానాంబ కుటుంబ సభ్యులు నిశ్చితార్థానికి వెళతారు. ఈ క్రమంలోనే అందరూ ఇంట్లో కి వెళుతుండగా ఒక ముసలావిడ నువ్వు ఆగు అంటూ జానకిని ఇంట్లోకి వెళ్ళకుండా ఆపడగా అప్పుడు జానకి కంగారు పడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷janakiJanaki Kalaganaledumallikarama chandra
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు