G
Telugu News » TV Serials » devi get emotional in todays devatha serial episode
⚡ TV Serials, Latest, Topstory

Devatha: ఆదిత్యకు మాట ఇచ్చిన రాధ.. అన్నం తినకుండా అలిగిన దేవి..?

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రాధ, ఆదిత్యకు, దేవిని దత్తత ఇస్తున్న అని చెప్పడంతో రామ్మూర్తి,జానకి, మాధవులు ఒక్కసారిగా షాక్ అవుతారు.

ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా రామ్మూర్తి ఏంటమ్మా రాద, దేవమ్మ ను ఆదిత్యకు దత్తత ఇవ్వడం ఏంటి? దేవిని విడిచిపెట్టి మేము ఉండగలమా? మన సంగతి పక్కన పెట్టు నువ్వు ఉండగలవా? అని రాధ ని నిలదీస్తాడు రామ్మూర్తి. అపుడు రాధ మాట్లాడుతూ నేను అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. మీరు ఎప్పుడూ ఆ సారు రుణం తీర్చుకోవాలి అని అంటుంటారు కదా.

Advertisement

నేను ఈ విధంగా ఆ సారు రుణం తీర్చుకోవాలి అని అనుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాద. ఆ తర్వాత రాద, ఆదిత్య ఎప్పుడు కలిసేచోట కలుస్తారు. అప్పుడు రాధ ఇంట్లో జరిగిన విషయం అంతా ఆదిత్యకు వివరిస్తుంది. అప్పుడు ఆదిత్య భయంతో అంటే నా బిడ్డని నాకు ఇవ్వవా అని అడగడంతో..లేదు పెనిమిటి ఇంట్లో అందరినీ ఒప్పించాను, ఇక దేవమ్మ ని ఒప్పించుడే త్వరలోనే దేవిని నీకు అప్పగిస్తాను అని మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

మరొకవైపు సూరి పానకం రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అరటి తొక్కను కాళ్లమీద వేయగా పానకం వచ్చి తనపై పడుతుంది అని ఊహించుకుంటూ ఉంటాడు. తీరా చూస్తే పానకం అరటి తొక్క పై కాలు వేసి భాష మీద పడుతుంది. అప్పుడు పానకం భాష అని పేరు అడిగి సిగ్గుపడి ఎక్కడ నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత బయటకు వెళ్ళిన పానకం భాషను చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది.

భాషా కమల కు తినిపించడం చూసిన పానకం భాషా ని పొగడడం తో సూరి కాపాడతాడు. మరోవైపు రామ్మూర్తి ఫ్యామిలీ అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అక్కడ అన్నం తింటూ అల్లరి చేయడంతో రాధ దేవిని తిడుతుంది. దీంతో అక్కడి నుంచి దేవి, చిన్మయి ఇద్దరు అలిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రామ్మూర్తి, జానకి, మాధవ లు కూడా అన్నం తినకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళి పోతారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷adithyaDevathadeviradha
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు