G
Telugu News » TV Serials » devayani fires on dharani in todays guppedantha manasu serial episode
TV Serials

Guppedantha Manasu: మహేంద్ర చేసిన పనికి షాక్ అయిన రిషి.. ధరణి పై విరుచుకు పడుతున్న దేవయాని..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తె  

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

దేవయాని ఎవరి మీద ఉన్న కోపం అంత ధరణి ఫై చూపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరు ఎవరి గురించి సరిగా పట్టించుకోవడం లేదు అంటూ, నువ్వు కూడా అదే విధంగా ఉన్నావు అంటూ ధరణిపై కోప్పడుతుంది. మరొకవైపు కేవలం మిషన్ ఎడ్యుకేషన్ కారణంగా కాలేజీకి పేరు వచ్చింది అంటే నేను ఒప్పుకోను అని మహేంద్ర తో అనగా అప్పుడు మహేంద్ర కాలేజీ విషయాలు కాలేజీలో మాట్లాడుకుంటే బాగుంటుంది అని అంటాడు.

అప్పుడు రిషి సరే కాలేజీలో మీటింగ్ అరేంజ్ చేస్తాను అప్పుడు మీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి అని అంటాడు. మరొకవైపు గౌతమ్ వసుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ వసు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు గౌతమ్ రిషి ని మొబైల్ ఇవ్వు కాల్ చేసుకొని ఇస్తాను అని ఎంత అడిగిన కూడా రిషి మొబైల్ ఎవ్వడు.

ఇక రెస్టారెంట్ లో జరిగిన విషయం గురించి వసుధారని అడుగుతూ నీవు ఉత్సాహానికి కారణం ఏంటి అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు వసు ఉత్సాహంగా ఉండడం మంచిదే కదా సార్ అని రిప్లై ఇస్తుంది. మరొకవైపు మహేంద్ర జగతి మీద కోపంతో ప్రాజెక్టు రిజెక్ట్ చేయడం నాకు నచ్చలేదు అని రిషి తో అంటాడు మహేంద్ర.

నీకు ఇష్టం వచ్చిన విధంగా నువ్వు అభిప్రాయం తీసుకున్నప్పుడు నాకు ఇష్టం వచ్చిన విధంగా నేను అభిప్రాయం తీసుకుంటాను. రాత్రంతా బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటారు మహేంద్ర. కాలేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను అంటూ రిషి కి రాజీనామా పత్రాన్ని అందించి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

మహేంద్ర చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. రిషి ఎంత పిలుస్తున్న పలకకుండా మహేంద్ర అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మహేంద్ర అలా చేయడానికి కారణం జగతి అని భావించిన రిషి ఆమెతో విరుచుకు పడతాడు. ఈ విషయాలు అన్నీ మళ్ళీ మా డాడీ కి చెప్పద్దు అంటూ దండం పెడతాడు రిషి. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

🏷devayanidharaniGuppedantha ManasumahendraRishivasudhara
f𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు