Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Earthquake AP : ఏపీలో మళ్లీ కంపించిన భూమి.. ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం..

Earthquake Andhra Pradesh

Earthquake Andhra Pradesh

Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి కంపించడంతో స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పు కంభంపాడుతో పాటు ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.

జిల్లాలోని ముండ్లమూరు మండలంతోపాటు తాళ్లూరులో పలు చోట్ల భూమి కంపించింది. పోలవరం, శంకరాపురం, వేంపాడు, ముండ్లమూరు, పసుపుగల్లు, తూర్పుకంభంపాడు, మారెళ్లలో భూప్రకంపనలు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు.

PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని, ప్రజల్లో భయాందోళనకు గురిచేసినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. ముండ్లమూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. గంగవరం, తాళ్లూరు, రామభద్రపురం సమీప గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించడం సర్వత్రా భయాందోళనలకు గురిచేసింది.

Advertisement

ఈ నేపథ్యంలో మరోసారి ఏపీలో భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలంతా భయందోళన చెందుతున్నారు. మేడారంలో రిక్టర్ స్కేలుపై 5 భూకంపతీవ్రత నమోదు అయింది. గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఏపీలోని ఇతర జిల్లాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తినష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు లేవు. స్థానిక అధికారులు భూకంప పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

Read Also : Earthquake Nepal : నేపాల్‌లో భూకంపం.. 4.8 తీవ్రతతో భూప్రకంపనలు.. భయాందోళనతో జనం పరుగులు!

Advertisement
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Exit mobile version