Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Paneer Mughalai Dum Biryani : నోరూరించే పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యాని.. ఇలా చేశారంటే చికెన్ బిర్యానీ కన్నా టేస్ట్ అదిరిపొద్ది..!

Paneer Mughalai Dum Biryani in Telugu

Paneer Mughalai Dum Biryani in Telugu

Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపొద్ది. ఇంతకీ ఈ పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

ముందుగా కడాయిలో రెండు యాలకులు, ఒకటిన్నర అంగుళాల దాల్చిన చెక్క, రెండు లవంగాలు, నాలుగు యాలుకలు, టేబుల్ స్పూన్స్ సోంపు వేసి సన్నని సెగ మీద సోంపు చిట్లే అంతవరకు లేదా రంగు మారేంతవరకు సిమ్ లోనే వేపుకోవాలి.

మసాలా దినుసులు మంచి పరిమళం వస్తున్నప్పుడు మిక్సర్ జార్‌లోకి తీసుకోండి. దీన్ని సాధ్యమైనంత మెత్తని పొడి చేసుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండేటటువంటి బిర్యాని హాండీలో పావు కప్పు నెయ్యిని కరిగించండి. కరిగిన నెయ్యిలో అర అంగుళం దాల్చిన చెక్క, జాపత్రి వేయండి. అప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.

Advertisement

వేగిన అల్లం వెల్లుల్లి ముద్దలు గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పొడిలో పావు కప్పు నీరు పోసి మసాలాలు మాడకుండా నూనె పైకి తేలేంతవరకు వేపుకోవాలి. మసాలాలు వేగేటప్పుడే రుచికి సరిపోను ఉప్పు కూడా వేసి వేపండి. మసాలాలో నుంచి నెయ్యి పైకి తేలుతున్నప్పుడు అరకప్పు చిలికినటువంటి పెరుగు వేసి పెరుగు మసాలాల్లో కలిసి కరిగిపోయేంతవరకు కలుపుకోండి.

Paneer Mughalai Dum Biryani : ధమ్ బిర్యానీ తయారీ విధానం

మసాలాలు పెరుగులో ఎగి నెయ్యి పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో ఆరేడు పచ్చిమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో వేసి వేపండి. ఆ తర్వాత అరకప్పు నీరు పోసి పన్నీర్ రెండు మూడు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇంపార్టెన్స్ లేదు ఎలా ఉన్నా పర్లేదు అని అనుకుంటే ఎండుకారం కాసింత పసుపు కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చు. మొగలాయి దం బిర్యానీ రుచిగా ఉండాలంటే స్మోక్ బయటికి పోకుండా మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు సిమ్‌లో వదిలేయండి.

రెండు మూడు నిమిషాల పాటు సిమ్‌లో వదిలేస్తే స్మోకీ ఫ్లేవర్ అంతా గ్రేవీ పట్టుకుంటుంది. అప్పుడు చాలా బాగుంటుంది. నాలుగు యాలకులు, ఓ బిర్యాని ఆకు 3 పచ్చిమిర్చి చీలికలు రెండున్నర టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి నాలుగు 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా మరగనిస్తే సరిపోతుంది. టేస్టు కోసం ఉప్పును సరిపోనంతగా వేయాలి.

Advertisement

ఇందులో నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. అలా కొద్దిసేపు ఉంచిన తర్వాత అన్నం 80శాతం వరకు ఉడికించాలి. అలా ఉడికించిన అన్నాన్ని ఇప్పుడు పన్నీర్ మిశ్రమంపై వేసుకోవాలి. ఎక్కడ అన్నాన్ని అధమ కూడదు. అన్నం మీద మూడు నాలుగు చెంచాల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దమ్ బయటికి పోకుండా మూత పెట్టేయాలి. హై ఫ్లేమ్ మీద నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల పాటు దమ్ చేసి స్టవ్ ఆపేసి 30 నిమిషాల పాటు వదిలేయండి.

30 నిమిషాల తర్వాత హండి మూత తీసి చూడండి. అన్నం మెతుకు పువ్వులా కనిపించాలి. ఒక్కసారి అడుగున కూడా చెక్ చేయండి ఒకవేళ ఇంకా నీట చెమ్మ ఉంటే మూత తీసి సిమ్‌లో పెట్టి ఉడికించండి. మిగిలిన చెమ్మ కూడా ఆవిరి అయిపోతుంది. అంతే.. పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ రెడీ.. మీరు కూడా ఇంట్లో ఈ బిర్యానీ ట్రై చేయండి..

Read Also : Kidney Stones : శరీరంలో నీరు తగినంత లేకుంటే ఈ ప్రాణాంతక వ్యాధి వస్తుంది జాగ్రత్త.. రోజుకు ఎంత నీరు తాగాలంటే?

Advertisement
Exit mobile version