Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

TECNO Spark Go 5G : కొత్త ఫోన్ భలే ఉందిగా.. టెక్నో స్పార్క్ గో 5G ఫీచర్లు అదుర్స్.. ధర కేవలం రూ.9,999 మాత్రమే!

Tecno Spark Go 5G Launched in India

Tecno Spark Go 5G Launched in India

TECNO Spark Go 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి శుభవార్త.. భారత మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 50MP బ్యాక్ కెమెరా(TECNO Spark Go 5G) సెన్సార్, 6000mAh బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ కలిగి ఉంది.

ఈ బడ్జెట్ ఫోన్ ధర రూ. 9,999 ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm చిప్‌సెట్‌తో వస్తుంది. ఇందులో 4GB + 128GB మోడల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌ల నుంచి లభ్యమవుతుంది. ఫస్ట్ సేల్ ఆగస్టు 21న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

TECNO Spark Go 5G : టెక్నో స్పార్క్ గో 5G స్పెసిఫికేషన్లు :

టెక్నో స్పార్క్ గో 5G ఫోన్ 6.74-అంగుళాల (1600 x 720 పిక్సెల్స్) HD+ ఫ్లాట్ LCD డిస్‌ప్లే కలిగి ఉంది. 670 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15పై రన్ అవుతుంది.

Advertisement

Read Also : Realme P4 Pro 5G : రియల్‌మి P4 ప్రో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

TECNO Spark Go 5G : ప్రాసెసర్ :

టెక్నో స్పార్క్ గో 5G లో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm ప్రాసెసర్ ఉంది. దాంతో పాటు Arm Mali-G57 MC2 GPU కలిగి ఉంది. 4GB LPDDR4X ర్యామ్, 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు.

టెక్నో స్పార్క్ గో 5G కెమెరా సెటప్ : 
టెక్నో స్పార్క్ గో 5Gలో సింగిల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, LED ఫ్లాష్ లైట్ ఉన్నాయి. ఈ కెమెరా సెన్సార్ 2K 30fps వద్ద వీడియోను రికార్డ్ చేయగలదు. 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.

Advertisement

టెక్నో స్పార్క్ గో 5G బ్యాటరీ :

టెక్నో స్పార్క్ గో 5G ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 3.5mm ఆడియో జాక్ ఉంది.

Exit mobile version