Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

SBI IMPS : గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచి SBI IMPS లావాదేవీ ఛార్జీల్లో మార్పులు.. ఏయే కస్టమర్లకు వర్తిస్తాయంటే?

SBI IMPS Charges

SBI IMPS Charges

SBI IMPS : ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) తమ రిటైల్ కస్టమర్లకు IMPS లావాదేవీ ఛార్జీలను సవరించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 15, 2025 నుంచి వర్తిస్తాయి.

ఈ మార్పులు ఆన్‌లైన్, బ్రాంచ్ ఛానెల్‌లలో భిన్నంగా ఉంటాయి. కొన్ని స్లాబ్‌లలో ఛార్జీలు మారాయి. మరికొన్నింటిలో పాతవి అలాగే ఉంటాయి. ఈ కొత్త మార్పులతో ఏయే కస్టమర్లపై ప్రభావం పడుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

IMPS ఏంటి? :
IMPS అనేది NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిర్వహించే రియల్-టైమ్ పేమెంట్ సర్వీసు. ప్రత్యేకత ఏమిటంటే.. 24×7 అందుబాటులో ఉంటుంది. బ్యాంకు సెలవు దినాలలో కూడా మీరు ఆన్‌లైన్‌లో డబ్బును బదిలీ చేయవచ్చు. ఎస్బీఐలో IMPS లావాదేవీలకు గరిష్ట పరిమితి రూ. 5 లక్షలు ( SMS, IVR ఛానెల్‌ మినహాయించి) ఉంటుంది.

Advertisement

SBI IMPS : SBIలో ఆన్‌లైన్ IMPS ఛార్జీలు :

రూ. 25,000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు.
రూ. 25,001 నుంచి రూ. 1 లక్ష వరకు రూ. 2 + GST
రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలు : రూ. 6 + GST
రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు : రూ. 10 + GST

గతంలో, ఆన్‌లైన్ IMPS లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ, ఇప్పుడు రూ. 25,000 కన్నా ఎక్కువ మొత్తాలకు నామమాత్రపు ఛార్జీ చెల్లించాలి.

SBI IMPS : బ్రాంచ్‌లో IMPS ఛార్జీలు​:

బ్రాంచ్ నుంచి జరిగే IMPS లావాదేవీల ఛార్జీలలో SBI ఎలాంటి మార్పు చేయలేదు.
కనీస ఛార్జ్ : రూ. 2 + GST
గరిష్ట ఛార్జ్ : రూ. 20 + GST

Advertisement

Read Also : Oppo K13 Turbo : గేమర్లకు పండగే.. ఒప్పో కొత్త K13 టర్బో ఫోన్ చూశారా? భలే ఉన్నాయి ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు

SBI IMPS : ఎవరికి తగ్గింపు లభిస్తుంది? :
SBI అనేక శాలరీ ప్యాకేజీ ఖాతాలకు ఆన్‌లైన్ IMPS ఛార్జీలను రద్దు చేసింది.

SBI IMPS : శౌర్య కుటుంబ పెన్షన్ ఖాతాలు :

దీనితో పాటు, కార్పొరేట్ జీతం ప్యాకేజీ, రాష్ట్ర ప్రభుత్వ జీతం ప్యాకేజీ, స్టార్టప్ జీతం ప్యాకేజీ, కుటుంబ సేవింగ్స్ అకౌంట్ కోసం ఆన్‌లైన్ ఛానెల్‌లలో ఛార్జీలు కూడా మాఫీ అవుతాయి.

Advertisement

ఇతర బ్యాంకుల IMPS ఛార్జీలు
కెనరా బ్యాంకు :
రూ. 1,000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు.
రూ. 1,000 నుంచి రూ. 10,000 : రూ. 3 + GST
రూ. 10,000 నుంచి రూ. 25,000 : రూ. 5 + GST
రూ. 25,000 నుంచి రూ. 1 లక్ష వరకు : రూ. 8 + GST
రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలు : రూ. 15 + GST
రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు : రూ. 20 + GST

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( PNB)
రూ. 1,000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు.
రూ. 1,001 నుంచి రూ. 1 లక్ష వరకు
బ్రాంచ్ నుంచి : రూ. 6 + GST
ఆన్‌లైన్ : రూ. 5 + GST

రూ. 1 లక్షపైనా లావాదేవీలు
బ్రాంచ్ నుంచి : రూ. 12 + GST
ఆన్‌లైన్ : రూ. 10 + GST

Advertisement

SBI చేసిన ఈ మార్పు చిన్న లావాదేవీల కస్టమర్లపై ప్రభావం ఉండదు. ఎందుకంటే.. రూ. 25,000 వరకు ఆన్‌లైన్ IMPSపై ఎలాంటి ఛార్జీ లేదు. కానీ, పెద్ద మొత్తాలను బదిలీ చేసే కస్టమర్లు ఇప్పుడు చిన్న ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే SBI కొత్త ఛార్జీలు తక్కువని గమనించాలి.

Exit mobile version