Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3పై ఏకంగా రూ.20వేలు బంపర్ డిస్కౌంట్.. ధర, ఫీచర్లు ఏంటో తెలిస్తే ఇప్పుడే కొంటారంతే..

Nothing Phone 3

Nothing Phone 3

Nothing Phone 3 : స్పెషల్ డిజైన్‌ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన డీల్. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌లతో నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3) అమ్మకానికి అందుబాటులో ఉంది. ప్రత్యేకమైన డిజైన్‌తో వచ్చే కంపెనీ ఫస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇదే. బటన్, బ్యాక్ సైడ్ స్మాల్ రౌండ్ డిస్‌‌ప్లే కలిగి ఉంది. అంతేకాదు.. ఈ డిస్‌ప్లేలోనే వినియోగదారులు టైమ్ చూడవచ్చు. ఈ ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3పై బిగ్ డిస్కౌంట్ :

కంపెనీ నథింగ్ ఫోన్ 3 ప్రారంభ ధర రూ.79,999కి లాంచ్ చేసింది. బేస్ వేరియంట్ 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ అయిన నెలలోనే రూ. 20 వేలు చౌకగా లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.

ఈ ఆఫర్ ICICI బ్యాంక్ కార్డ్‌తో పేమెంట్లపై లభ్యమవుతుంది. రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. మొత్తం రూ.20వేలు భారీ తగ్గింపు పొందవచ్చు. పాత నథింగ్ ఫోన్ 1పై ట్రేడ్ చేసి ఏకంగా రూ.22,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.

Advertisement

Nothing Phone 3 : డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ :

ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ LTPS డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని సపోర్ట్ చేస్తుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5150mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. కేవలం 54 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

Read Also : Moto G86 Power : కొత్త మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 53 గంటల బ్యాకప్.. ధర చాలా తక్కువ..!

ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. నథింగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ నథింగ్ ఫోన్ టాప్ వేరియంట్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్‌ కలిగి ఉంది.

Advertisement

కెమెరా సెటప్ :
50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 60x జూమ్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో పెరిస్కోప్ లెన్స్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 50MP కెమెరా కూడా ఉంది.

స్మార్ట్‌ఫోన్ మరిన్ని ఫీచర్లు :
వాటర్, డస్ట్ నుంచి రక్షణ కోసం ఈ నథింగ్ ఫోన్‌కు IP68 రేటింగ్ ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ LED డిస్‌ప్లే కూడా కలిగి ఉంది.

Advertisement
Exit mobile version