Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Lava Play Ultra 5G : లావా ఫస్ట్ గేమింగ్ ఫోన్ వస్తోందోచ్.. ఈ నెల 20నే లాంచ్.. AI ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు

Lava Play Ultra 5G

Lava Play Ultra 5G

Lava Play Ultra 5G : లావా అభిమానుల కోసం సరికొత్త ఫోన్ రాబోతుంది. లావా ప్లే అల్ట్రా 5G కంపెనీ మొట్టమొదటి గేమింగ్-సెంట్రిక్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా భారత మార్కెట్లో (Lava Play Ultra 5G Launch) త్వరలో లాంచ్ కానుంది. స్పెసిఫికేషన్లు ఇంకా రివీల్ చేయనప్పటికీ, రాబోయే హ్యాండ్‌సెట్ లాంచ్ తేదీని బ్రాండ్ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 5G కెపాసిటీకి సపోర్ట్ చేస్తుందని సూచిస్తుంది. అయితే, టీజర్ ప్రకారం.. 64MP AI మ్యాట్రిక్స్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

Lava Play Ultra 5G : లావా ప్లే అల్ట్రా 5G భారత్ లాంచ్ తేదీ :

లావా ప్లే అల్ట్రా 5G బుధవారం (ఆగస్టు 20) భారత మార్కెట్‌లో లాంచ్ కానుందని కంపెనీ X పోస్ట్ ద్వారా ప్రకటించింది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. లావా ప్లే అల్ట్రా 5G లాంచ్ కోసం ఈ-కామర్స్ దిగ్గజం మైక్రోసైట్‌ కూడా ఏర్పాటు చేసింది.

ఈ పేజీలో ఫోన్ స్పెసిఫికేషన్లను వెల్లడించనప్పటికీ, రాబోయే హ్యాండ్‌సెట్ గేమింగ్ ఫీచర్లతో రానుందని సూచిస్తుంది. మొబైల్ గేమింగ్ పర్ఫార్మెన్స్‌లో కొత్త యుగం ఇప్పుడు ప్రారంభమవుతుందని పేర్కొంది.

Advertisement

Read Also : Indian Railways : రైల్లో ఈ 7 వస్తువులను పొరపాటున ఎప్పుడూ తీసుకెళ్లొద్దు.. లేదంటే జరిమానా, జైలుశిక్ష తప్పదు..!

PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

ముఖ్యంగా, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో కంపెనీ పోస్ట్ హ్యాండ్‌సెట్ డిజైన్‌ను టీజ్ చేసింది. లావా 5G బ్రాండింగ్‌తో గ్లాస్ బ్యాక్ ఉండే అవకాశం ఉంది. పవర్, వాల్యూమ్ బటన్లు ఫ్రేమ్ రైట్ సైడ్ ఉన్నట్లు కనిపిస్తాయి. అయితే ఫోన్ లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది.

లావా మొబైల్ పోస్టు

See More. Play More. 🎮

Advertisement

సోషల్ మీడియాలో నివేదికల ప్రకారం.. లావా ప్లే అల్ట్రా 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED స్క్రీన్‌ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. UFS 3.1 స్టోరేజ్‌తో MediaTek Dimensity 7300 SoC ద్వారా పవర్ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 7 లక్షల కన్నా ఎక్కువ AnTuTu బెంచ్‌మార్క్ స్కోర్‌ను అందించవచ్చు. డెడికేటెడ్ గేమ్‌బూస్ట్ మోడ్ ద్వారా మెరుగైన గేమింగ్ పర్ఫార్మెన్స్ సపోర్ట్ చేయవచ్చు.

Lava Play Ultra 5G : ఆప్టిక్స్ విషయానికొస్తే..

లావా ప్లే అల్ట్రా 5G బ్యాక్ సైడ్ 64MP ఏఐ మ్యాట్రిక్స్ కెమెరా ఉంటుందని పుకారు ఉంది. కెమెరా సిస్టమ్‌లో డ్యూయల్ కెమెరా, సోనీ IMX682 ప్రైమరీ సెన్సార్ ఉండవచ్చు. ఇతర ముఖ్య ఫీచర్లలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, సౌండ్ క్యాన్సిలేషన్ కోసం డ్యూయల్ మైక్రోఫోన్లు ఉన్నాయి. రాబోయే హ్యాండ్‌సెట్ 5,000mAh బ్యాటరీతో 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆగస్టు 20న లావా ప్లే అల్ట్రా 5G లాంచ్ అయ్యే సమయానికి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Exit mobile version