Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

HDFC Bank Minimum Balance : HDFC కస్టమర్లకు బిగ్ షాక్.. ఇకపై ఖాతాలో రూ. 25వేలు కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిందే.. లేదంటే జరిమానా!

HDFC Bank Minimum Balance

HDFC Bank Minimum Balance

HDFC Bank Minimum Balance : HDFC బ్యాంకు కస్టమర్లకు బిగ్ షాక్.. ICICI బ్యాంక్ తర్వాత ఇప్పుడు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC కూడా తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. HDFC బ్యాంక్ కొత్త సేవింగ్స్ అకౌంట్లలో కనీస సగటు నెలవారీ బ్యాలెన్స్ పరిమితిని భారీగా పెంచింది.

బ్యాంక్ ప్రకారం.. ఆగస్టు 1, 2025 నుంచి మెట్రో, పట్టణ బ్రాంచులలో ఓపెన్ చేసిన కొత్త అకౌంట్లలో నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ. 25,000 ఉంచడం తప్పనిసరి. అయితే, ఇంతకు ముందు ఈ లిమిట్ రూ. 10,000 ఉండేది.

అలాగే ICICI బ్యాంక్ ఇప్పుడు కస్టమర్లు రూ. 10,000కి బదులుగా రూ. 50,000 కనీస సగటు నెలవారీ బ్యాలెన్స్‌ను ఉంచాల్సి ఉంటుందని ప్రకటించింది. అయితే, బ్యాంక్ నిర్ణయంపై కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత కారణంగా రూ. 15వేలకు ఫిక్స్ చేసింది.

Advertisement

HDFC Bank Minimum Balance : ఈ కస్టమర్లకు రూల్ వర్తిస్తాయి :

ఈ పరిమితిని సెమీ-అర్బన్ శాఖలకు రూ. 5,000, గ్రామీణ శాఖలకు రూ. 2,500 (త్రైమాసిక సగటు)గా నిర్ణయించింది. ఈ నియమాలు కొత్త ఖాతాలకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే, మునుపటి రూల్స్ పాత ఖాతాదారులకు వర్తిస్తాయి.

Read Also : ICICI Minimum Balance : కస్టమర్లకు గుడ్ న్యూస్.. ICICI బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ రూ. 15వేలు ఉంటే చాలు..!

HDFC బ్యాంక్‌లో ఇప్పటికే సేవింగ్స్ అకౌంట్ ఉన్న కస్టమర్లు వేరే విధంగా తెలియకపోతే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఖాతాలను తెరవచ్చు. అయితే, ఆగస్టు తర్వాత ఖాతాలు తెరిచిన వారికి కొత్త పరిమితిని దాటితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది.

Advertisement

HDFC Bank Minimum Balance : పెనాల్టీ ఎంతంటే? :

కస్టమర్లు అవసరమైన బ్యాలెన్స్‌ను విఫలమైతే లోటును బట్టి 6శాతం వరకు లేదా గరిష్టంగా రూ. 600 వరకు జరిమానా విధిస్తుంది. ఖాతాల నిర్వహణ ఖర్చు, సర్వీసు క్వాలిటీ కోసం ఈ మార్పు అవసరమని బ్యాంక్ వివరించింది. కొత్త షరతుల ప్రకారం.. ఖాతాలలో రూ.25,000 బ్యాలెన్స్‌ను ఉంచాల్సి ఉంటుంది. ఈ సవరణకు ముందు HDFC బ్యాంక్ MAB అవసరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఈ పరిమితులు సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో మారవు. తాజా సవరణ ప్రత్యేకంగా మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాలలోని కొత్త ఖాతాలకు వర్తిస్తుంది.

HDFC Bank Minimum Balance :  క్లాసిక్ ఖాతాదారులకు ప్రత్యేక బ్యాలెన్స్ :

HDFC బ్యాంక్ ‘క్లాసిక్’ కస్టమర్లకు ప్రత్యేక బ్యాలెన్స్ అందిస్తుంది. దీనికి అర్హత పొందాలంటే మీరు ఈ ప్రమాణాలలో కనీసం ఒకదానిని పూర్తి చేయాలి. సగటు నెలవారీ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ రూ. లక్ష ఉండాలి. సగటు త్రైమాసిక కరెంట్ ఖాతా బ్యాలెన్స్ రూ. 2 లక్షలు ఉండాలి. జీతం పొందే కస్టమర్ల కోసం HDFC బ్యాంక్ కార్పొరేట్ శాలరీ అకౌంట్లలో నెలవారీ నికర జీతం రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

Advertisement
Exit mobile version