Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Driving Licence : పేపర్ డాక్యుమెంట్లు అక్కర్లేదు.. మీ డ్రైవింగ్ లైసెన్స్, RC మీ మొబైల్‌లోనే.. పోలీసులు అడిగితే ఇవే చూపించొచ్చు..!

Driving Licence And RC DigiLocker

Driving Licence And RC DigiLocker

Driving Licence : నేటి డిజిటల్ యుగంలో చాలా మంది తమ పేపర్ డాక్యుమెంట్లను తమతో తీసుకెళ్లరు. ఫిజికల్ డాక్యుమెంట్లు (Driving Licence) ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా డిజిటలైజేషన్‌ను ప్రోత్సహిస్తోంది.

డిజిలాకర్, (digilocker), ఎంపరివాహన్ (mParivahan) వంటి యాప్‌లు సామాన్య ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాయి. ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఫొటో తీసి ఫోన్‌లోనే డిజిలాకర్‌లో ఉంచండి. ఫిజికల్ డాక్యుమెంట్లను తీసుకెళ్లడంలో ఇబ్బందిని తొలగిస్తుంది. పోగొట్టుకుంటామనే భయాన్ని కూడా ఉండదు.

2018లో, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) అడ్వైజరీని జారీ చేసింది. ఇందులో డిజిలాకర్ లేదా ఎంపరివాహన్ యాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్, RC, ఇతర డాక్యుమెంట్లు మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం చట్టబద్ధంగా వ్యాలీడ్ అవుతాయని స్పష్టంగా పేర్కొంది.

Advertisement

అంటే.. పోలీసులు మిమ్మల్ని ఆపినట్లయితే.. మీ మొబైల్‌లో చూపించే డాక్యుమెంట్లను చూపించవచ్చు. పోలీసులు వాటిని అంగీకరించాలి. ఈ రూల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం వర్తిస్తుంది. ఇందులో డిజిటల్ డాక్యుమెంట్లను కాగితపు డాక్యమెంట్లతో సమానంగా పరిగణిస్తారు.

Read Also : Aadhar Card Loan : మీ ఆధార్ కార్డుతో రూ. 5000 ఇన్‌స్టంట్ లోన్ తీసుకోవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?

Driving Licence : ఇన్సూరెన్స్ కాపీ వెంట తీసుకెళ్లనవసరం లేదు :

ఇప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ సమాచారం (VAHAN) పోర్టల్‌లో కూడా అప్‌డేట్ అవుతుంది. బీమా సమాచార బ్యూరో (IIB) ప్రతిరోజూ ఈ పోర్టల్‌లో కొత్త బీమా పాలసీలు, రెన్యువల్ డేటాను అప్‌లోడ్ చేస్తుంది. దీని కారణంగా ఈ సమాచారం (mParivahan, eChallan) వంటి యాప్‌లలో కనిపిస్తుంది. వెహికల్ యాక్టివ్ ఇన్సూరెన్స్ యాప్‌లో కనిపిస్తే.. మీరు బీమా ప్రింట్ కాపీని మీతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

Advertisement

డిజిలాకర్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ను ఎలా యాడ్ చేయాలి? :

Exit mobile version